త్వరలో తెలంగాణ క్యాబినెట్ సమావేశం ఉన్న నేపథ్యంలో పెండింగ్ ప్రతిపాదనలు పంపాల్సిందిగా సాధారణ పరిపాలన శాఖ అన్ని విభాగాల కార్యదర్శులకు, ముఖ్య కార్యదర్శులకు, ప్రత్యేక ప్రధాన కార్యదర్శులకు నోట్ జారీ చేసింది. అసెంబ్లీ సమావేశాలతో సహా పలు కీలక అంశాలపై మంత్రివర్గ భేటీలో చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు. ముఖ్యమంత్రి కెసిఆర్ ఢిల్లీ పర్యటనలో ఒక కీలకమయిన నిర్ణయం జరిగింది. జోనల్ వ్యవస్థకు ప్రధాని ఆమోదం తెలపారు. త్వరలో రాష్ట్రపతి సవరణ ఉత్తర్వులు వెలువడనుండటంపై ముఖ్యమంత్రి ఈ సమావేశంలో మంత్రులతో చర్చించనున్నట్లు తెలిసింది. ఢిల్లీ విశేషాలను కూడా వివరించనున్నట్లు సమాచారం.
ఎజెండా
-సెప్టెంబర్ మొదటి వారంలో అసెంబ్లీ సమావేశాలు?
-డీఏ ప్రకటన వచ్చే అవకాశం.
ఉద్యోగులకు ఐఆర్ ప్రకటనపై నిర్ణయం.
-బుద్వేల్లో రెడ్డి హాస్టల్ భవనానికి అదనంగా 5 ఎకరాల స్థలం.
-జోనల్ వ్యవస్థ అమలుకు విధి విధానాలు, మరికొన్ని సవరణలకు ఆమోదం.
-ఆత్మ గౌరవ భవన్ ల కేటాయింపు నిర్ణయానికి ఆమోదం.
-అర్చకులకు వయోపరిమితి పెంపు, వేతనం పెంపు నిర్ణయానికి ఆమోదం.
-రెవెన్యూ, ఆర్థిక శాఖల నుంచి మరికొన్ని ముఖ్యమైన ఫైళ్లు.
(feature File Photo)