స్వామి పరిపూర్ణానంద హైదరాబాద్ నగరం నుంచి బహిష్కరించాడాన్ని దళిత మేధావి, ఫిల్మ్ క్రిటిక్ కత్తి మహేశ్ ఖండించారు.
కత్తి మహేశ్ ఇప్పటికే నగర బహిష్కరణలో ఉన్నారు. ఈ దళితులనుంచి, ప్రజాస్వామిక వాదులనుంచి మహేశ్ బహిష్కరణ మీద విమర్శలు వెల్లువెత్తడంతో తెలంగాణ ప్రభుత్వం ఈ తెల్లవారు జామున స్వామి పరిపూర్ణానందను కూడా హైదరాబాద్ నుంచి ఆరునెలల పాటు బహిష్కరించింది. ఆయనను సొంతూరు కాగినాడు తరలించినట్లు చెబుతున్నారు. ఈ చర్య మీద మహేశ్ స్పందించారు.
‘బహిష్కరణలు ఈ సమస్యకు పరిష్కారం కాదు.బహిష్కరణ ఆధునిక ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధం.మనుషుల్ని “తప్పిస్తే” సమస్యలు తప్పుతాయి అనే ఆటవిక సమాజం దిశగా ప్రభుత్వాలు పయనిస్తే అది తిరోగమనమే అవుతుంది,’ అని ఆయన ట్వీట్ చేశారు.
పరిపూర్ణానంద నగర బహిష్కరణను ఖండిస్తున్నాను. బహిష్కరణలు ఈ సమస్యకు పరిష్కారం కాదు.బహిష్కరణ ఆధునిక ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధం.మనుషుల్ని “తప్పిస్తే” సమస్యలు తప్పుతాయి అనే ఆటవిక సమాజం దిశగా ప్రభుత్వాలు పయనిస్తే అది తిరోగమనమే అవుతుంది.
— Kathi Mahesh™️ (@kathimahesh) July 11, 2018