ఎంతో కాలంగా వూరిస్తూ వస్తున్న అన్న క్యాంటీన్ లు ఈ రోజు ప్రారంభమయ్యాయి. చాలా కాలం కిందట టెకెన్ గా అమరావతిలో ప్రారంభమయిన విస్తరణ వాయిదా పడుతూ వచ్చింది ఈ రోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విజయవాడ విద్యాధర పురంలో క్యాంటీన్ ప్రారంభించారు. ‘ఎ’ కన్వెన్షన్ సెంటర్లో క్యాంటిన్ ప్రారంభోత్సవ సభలో ప్రసంగించారు.
అంతా కడుపారా తినాలనే ఉద్దేశంలో ‘అన్న క్యాంటీన్’ ల ను ప్రారంభించామని ముఖ్యమంత్రి అన్నారు. క్వాలిటీ, క్వాంటిటీ విషయంలో రాజీలేకుండా పేదలకు భోజనం, టిఫిన్ అందిస్తామని చెబుతూ ప్రజల నుంచి అభిప్రాయసేకరిస్తూ క్యాంటీన్ల నిర్వహణ పాదర్శకంగా ఉండేలా చూస్తామని అన్నారు.క్యాంటీన్ లో లబ్ధిదారులతో కలసి భోజనం చేస్తూ భోజనం ఎలా ఉందని ముఖ్యమంత్రి అడిగితెలుసుకున్నారు. క్యాంటీన్ పరిసరాలను స్వయంగా పరిశీలించి సూచనలు చేశారు. పేదలు, వృద్దులకు ఈ క్యాంటీన్ లు ఒక వరమని భవిష్యత్ లో ఎన్ని ఇబ్బందులు ఎదురైనా ఈ క్యాంటీన్ ల నిర్వహణ కొనసాగుతుందని ఆయన చెప్పారు.
మరిన్ని విశేషాలు:
ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా 100 అన్న క్యాంటీన్ కేంద్రాలు ప్రారంభం..
రెండో విడతలో అగస్టు 15 కల్ల మరో 103 క్యాంటీన్ లు ఏర్పాటు.
మొత్తం203 కేంద్రాలలో ప్రతిరోజూ రెండున్నర లక్షల మందికి అల్పాహారం, భోజనం అందించేలా ఏర్పాట్లు.
పేద, మధ్యతరగతి ప్రజలకు అతి తక్కువ ధరకు మూడు పూటలా ఆహారాన్ని అందించే లక్ష్యంతో అన్నా క్యాంటీన్‌ను విజయవాడ విద్యాధరపురంలో నేడు ప్రారంభించాము. తొలి దశలో రాష్ట్ర వ్యాప్తంగా 35 పట్టణాల్లో 100 క్యాంటీన్లు 2.15 లక్షల ప్లేట్ల ఆహారం అందించే లక్ష్యంతో నేటి నుండి పనిచేస్తాయి. #AnnaCanteen pic.twitter.com/cMHVkenOpv
— N Chandrababu Naidu (@ncbn) 11 July 2018