భావ వ్యక్తీకరణ పేరుతో ‘వివాదాస్పద’ వ్యాఖ్యలు చేసి శాంతి భద్రతలకు భంగం కల్గిస్తున్నాడని దళిత మేధావి, ఫిల్మ్ క్రిటిక్ కత్తి మహేష్ ను హైదరాబాద్ నగరం నుంచి బహిష్కరించడాన్ని పలువురు ప్రజాస్వామిక వాదులు, వామపక్షాలు, రాజకీయ పక్షాలు తప్పు పడుతున్నాయి. బహిష్కరణ నిర్ణయాన్ని డిజిపి మహేందర్ రెడ్డి స్వయంగా ప్రకటించారు. హైదరాబాద్ కు చెందిన ఎంబిటి (మజ్లిస్ బచావో తెహరీక్ ) పోలీసులు తీసుకున్న నిర్ణయాన్ని తప్పు పట్టింది. నగరానికి చెందిన బిజెపి ఎమ్మెల్యే రాజా సింగ్ మీద మతవిద్వేషాలకు రెచ్చగొడుతున్నాడంటూ ఎన్నో కేసులు బుక్ అయ్యాయని, ఆయనకు లేని శిక్ష కత్తి మహేశ్ కు విధించడం సరికాదని ఎంబిటి నేత అమ్జదుల్లాఖాన్ అభిప్రాయపడ్డారు.
BJP MLA T Raja Singh have more than 30 cases of spreding communal enimity and our @TelanganaDGP has no guts to arrest him but to appease #HinduVoteBank serves Six months externment to controversial film critic Katti Mahesh, @amjedmbt to @aajtak. pic.twitter.com/q42kHMWN3R
— Amjed Ullah Khan MBT (@amjedmbt) July 9, 2018
రాజాసింగ్ కు డిజిపిని విమర్శించే గుండె ధైర్యం లేదని ఆయన ట్వీట్ చేశారు. ఇది బిజెపి వత్తిడితో తీసుకున్న నిర్ణయమని హిందూ ఓట్ల కోసం తీసుకున్న చర్య అని ఆయన అభిప్రాయపడ్డారు.
ఇదే విధంగా ప్రజా ఉద్యమకారిణి, ప్రొఫెసర్ సూరే పల్లి సుజాత కూడా మహేష్ బహిష్కరణ పట్ల అభ్యంతరం చెబుతూ డిజిపికి లేఖ రాశారు.