లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్నారు టిఆర్ఎస్ యువనేత, పెద్దపల్లి ఎంపి బాల్క సుమన్. బోయిని సంధ్య, విజేత ఇద్దరూ తమను లైంగికంగా బాల్క సుమన్ వేధించాడని వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పైగా తమను పోలీసులు వేధిస్తున్నారని, సుమన్ లైంగికంగా వేధించినట్లు బయటచెబితే బాగుండదని పోలీసులు బెదిరిస్తున్నారని వారు చెబుతుున్నారు. బాల్క సుమన్ వ్యవహారం టిఆర్ఎస్ పార్టీని ఇరకాటంలోకి నెట్టే పరిస్థితులు కనబడుతున్నాయి.
ఈ నేపథ్యంలో బాల్క సుమన్ అనుచరులు సోషల్ మీడియాలో పలు అంశాలను లేవనెత్తారు. బోయిని సంధ్య, బోయిని విజేత ఇద్దరూ అక్కచెల్లెల్లే అని తేల్చి చెప్పారు. అంతేకాదు.. వారు గతంలోనూ జైలుపాలయ్యారని, చెబుతున్నారు. బాల్క సుమన్ అనుచరుడు, టిఆర్ఎస్ వి నేత విద్యాసాగర్ ఫేస్ బుక్ లో పోస్టు చేసిన పోస్టు కింద ఉంది చూడండి. అందులో సంధ్య, విజేత గురించి మరిన్ని అంశాలు వెల్లడించారు. మరి వారు చెప్పింది నిజమా? లేక సుమన్ అనుచరులు చేస్తున్న ప్రచారం నిజమా అన్నది తేలాల్సి ఉంది.
విద్యాసాగర్ ఫేస్ బుక్ పోస్టులు కింద ఉన్నాయి. చూడండి.