ప్రభుత్వ ఆసుపత్రులకు వచ్చే రోగుల బంధువులకు మధ్యాహ్నం పూట భోజనం పెట్టే కార్యక్రమాన్ని గురువారం ఆర్మూర్ ప్రభుత్వ ఆస్పత్రిలో ఎంపీ కల్వకుంట్ల కవిత ఆధ్వర్యంలో ప్రారంభమైంది మొదటగా నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రిలో ఈ కార్యక్రమాన్ని ఆమె ప్రారంభించారు.
తర్వాత ఈ కార్యక్రమం కొనసాగుతోంది ప్రభుత్వ ఆసుపత్రుల్లో భోజన సదుపాయం ఆస్పత్రి కల్పిస్తోంది. అయితే రోగులకు తోడుగా ఉండే వారి బంధువులు, కుటుంబ సభ్యులు భోజనం కోసం , ఆహార పదార్థాల కోసం ఆస్పత్రి చుట్టుపక్కల ఉండే చిన్న చిన్న హోటళ్ళు, తోపుడు బండ్లు, బేకరీ లపై ఆధారపడుతున్నారు. గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చే వీరంతా ఇలా హోటళ్లలో భోజనం చేయడం ఆర్థికంగా భారమే కాకుండా..చికిత్స పొందుతున్న తమ వారికి ఎమర్జెన్సీ అయితే ఎలా అన్న టెన్షన్ తో గబ గబా నాలుగు ముద్దలు తినేసి పేషంట్ దగ్గరికి పరుగున వస్తుంటారు. ఈ పరిస్థితిని ఆసుపత్రుల్లో కేసీఆర్ కిట్ ను ప్రారంభించినప్పుడు, అదనపు సౌకర్యాలు, పరికరాలు ప్రారంభోత్సవానికి వెళ్ళిన సందర్భంలో ఎంపి కల్వకుంట్ల కవిత స్వయంగా చూశారు.
ఆపరేషన్ థియేటర్ల ముందు పడిగాపులు పడే వారికి అన్న పానీయాలు కూడా తీసుకోలేని పరిస్థితిని చూసి చలించిపోయారు కవిత. ఆసుపత్రిలోనే భోజనం పెడితే రోగుల బంధువులు, సహాయకులకు ఉపయోగంగా ఉంటుందని ఆలోచన చేసిన ఎంపి కవిత నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలో మధ్యాహ్నం భోజనం పెట్టే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఇటీవల కలెక్టరేట్ లో సమీక్ష సమావేశానికి హాజరయిన మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు ఎంపి కవిత తో పాటు భోజనం చేశారు. భోజనం రుచిగా ఉందని ప్రశంసించారు కూడా. మంచి కార్యక్రమమని అభినందించారు. ఆకలి తీరుస్తూ అన్నపూర్ణ గా మారారని అన్నారు. బోధన్ లోనూ రోజూ భోజనం పెట్టిస్తున్నారు ఎంపి కవిత.
ఆర్మూర్ ప్రభుత్వాసుపత్రి 100 పడకల ఆస్పత్రి అ వడంతో ఆసుపత్రికి వచ్చే రోగులు సంఖ్య పెరిగింది. ప్రసవాల్లోనూ ఆర్మూర్ ఆసుపత్రి రాష్ట్రం లో నెంబర్ వన్ గా నిలిచింది. నెలకు 200పైగానే డెలివరీలు జరుగుతుండడం విశేషం. నిజామాబాద్ ఎంపి కల్వకుంట్ల కవిత ఆధ్వర్యంలో భోజనం పెట్టే కార్యక్రమం నిత్యాన్నదాన కార్యక్రమంగా కొనసాగుతోంది.
నిజామాబాద్ ప్రభుత్వాసుపత్రిలో భోజనం పెట్టే కార్యక్రమం ప్రారంభించి నేటికి (గురువారం) 240 రోజులు అయ్యాయి. బోధన్ లో 72 రోజులు పూర్తయ్యాయి. నిజామాబాద్, బోధన్ ప్రభుత్వాసుపత్రుల్లో దాదాపు 1100 మందికి రోజూ భోజనం పెడుతున్నారు. ఆర్మూర్ లో ఈ రోజు 432 మందికి భోజనం పెట్టారు.
తెలంగాణ జాగృతి నిజామాబాద్ జిల్లా నాయకులు, ఆర్మూరు నాయకులు ఈ కార్యక్రమాన్ని ఇవాళ ప్రారంభించారు. కవితమ్మ సల్లంగా ఉండాలే.. అని పేషెంట్ల బంధువులు, సహాయకులు దీవించారు. వయసులో చిన్నదైనా పెద్ద మనసుతో అన్నం పెడుతోంది అని వృద్దులు అన్నారు.