తెలంగాణ సిఎం కేసిఆర్ తొలి నాళ్లలో కరీంనగర్ లో పర్యటించారు. కరీంనగర్ లో ప్రెస్ మీట్ పెట్టి కరీంనగర్ పట్టణాన్ని అద్భుతమైన నగరంగా మారుస్తానని ప్రకటించారు. తానే స్వయంగా పర్యవేక్షిస్తానని, కరీంనగర్ నగరం ఇట్లా ఉంటదా అన్నంతగా డెవలప్ చేస్తానన్నారు.
అదే మాటను అసెంబ్లీ వేదిక మీద నుంచి కూడా కుండబద్ధలు కొట్టి ప్రకటించారు. ఈ నేపథ్యంలో నెలలు గడిచినా కరీంనగర్ స్థితి ఏమాత్రం మారలేదని చెబుతూ ఒక కేసిఆర్ 100 అబద్ధాలు అనే పేరుతో ఒక వీడియో పోస్టును ఫేస్ బుక్ లో ఉంచారు. ఇప్పుడు అది సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. కింద వీడియో ఉంది మీరూ ఒక లుక్కేయండి.