సీనియర్ నేత రాజ్య సభ సభ్యుడు డి.శ్రీనివాస్‌పై నిజామాబాద్ టీఆర్ఎస్ నేతలు భగ్గుమన్నారు. డీఎస్ పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని వారు ఆరోపిస్తున్నారు. సీనియర్ అయినా సరే డీఎస్‌పై చర్యలు తీసుకోవాలని సీఎం కేసీఆర్‌ను నేతలు కోరనున్నట్లు తెలిసింది.
డిఎస్ కాంగ్రెస్ డిచ్ చేసి, ’బంగారు తెలంగాణ’ నిర్మాణంలో పాలుపంచుకుంటానంటు కబుర్లు చెప్పి టిఆర్ ఎస్ లో చేరిన సంగతి తెలిసిందే. దానికి బదులుగా నిజాంబాద్ రాజకీయాలలో డిఎస్ గొంతు వినిపించకుండా ,మనిషి కనిపించకుండా చేసేందుకు ఆయనను ముఖ్యమంత్రి కెసిఆర్ రాజ్యసభకు పంపారు. అయితే, ఇపుడు ఆయన కాంగ్రెస్ లోకి వెళ్లాలనుకుంటున్న సమాచారం టిఆర్ ఎస్ నేతకు తెలిసింది. ఆయన మీద తిరుగుబాటు ప్రకటించండి కొంతమందిని పురమాయించారు.
ఈ తిరుగుబాటు విషయం చర్చించేందుకు నిజామాబాద్ ఎంపీ కవిత ఇంట్లో టీఆర్ఎస్ నేతలు బుధవారం సమావేశమయ్యారు. బీబీ పాటిల్, ప్రశాంత్‌రెడ్డి, తుల ఉమ, ఎమ్మెల్యేలు బాజిరెడ్డి, జీవన్‌రెడ్డి, షకీల్, ఏనుగు రవీందర్‌రెడ్డి ఈ సమావేశానికి హాజరయ్యారు. డీఎస్ వల్ల పార్టీకి ఎలాంటి ప్రయోజనం కలగలేదని టీఆర్ఎస్ నేతలు చెబుతున్నారు. గ్రూప్‌లు కట్టడం, పైరవీలు చేయడం, అక్రమార్జన డీఎస్‌కు అలవాటే అని, అవినీతికి ఆస్కారం లేని టీఆర్ఎస్లో డీఎస్ ఇమడలేకపోతున్నారని తెలిపారు.
స్వార్థ ప్రయోజనాలు నెరవేరకపోవడంతో కుట్రలకు తెరలేపారని, కాంగ్రెస్‌లో చేరడానికి ఢిల్లీ పెద్దలతో డీఎస్ మంతనాలు జరిపారని నిజామాబాద్ టీఆర్ఎస్ నేతలు ఆరోపించారు.
కాంగ్రెస్ గూటికి మాజి మంత్రి డిఎస్.
నిన్న డిల్లిలొ గులాం నబి ఆజాద్ తొ బేటి అయ్యారు. నిజానికి
సోనియా గాంధీ అపాయింట్ మెంట్ కోసం డిల్లిలొ మూడు రోజుల పడిగాపులు కాస్తున్నారు.ఇది వీలుకాకపోవడంతో ఆయన ఆజాద్ తో భేటీ అయ్యారు.
నో కామెంట్
ఇది ఇలా ఉంటే, తను పార్టీ మారుతున్న వార్తల మీద స్పందించేందుకు డిఎస్ నిరాకరించారు. ఢిల్లీ నుంచి తిరిగొచ్చాక, ఈరోజు ఆయన నిజామాబాద్ లోని తన నివాసంలో అనుచరులతో సమావేశమయ్యారు. పెద్ద కుమారుడు సంజయ్ తోపాటు మద్దతుదారులు, అభిమానులతో పెద్ద సంఖ్యలో ఈ సమావేశంలో పాల్గొన్నారు. కొంతమంది టిఆర్ ఎస్ నాయకులు తనకు వ్యతిరేకంగా ముఖ్యమంత్రి కెసిఆర్ ఫిర్యాదు చేసుకున్నారన్నపుడు నాకు అభ్యంతరం లేదు అని డి.ఎస్ చెెప్పారుు. ‘చేస్తాం అన్నది ఫిర్యాదు మాత్రమే కదా,
నా గొంతు కోస్తాం అని చెప్పలేదు కదా’ అని ఆయన వ్యాఖ్యానించారు. ‘నేను ఉన్న పార్టీకి వ్యతిరేకంగా ఎప్పుడూ పని చేయను.’’ అని కూడా డిఎస్ చెప్పారు. ఇంకా జరుగబోయే పరిణామాల మీద ‘నేనిప్పుడే ఏం మాట్లాడలేను’ అని అన్నారు.