ప్రధానితో కెటిఆర్ ఏమ్మాట్లాడారో తెలుసా?

 

ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ నెల 15 న ప్రధానిని కలిసి రాష్ట్రానికి ఇచ్చిన హామీలను అమలు చేయాలని 10 ప్రతిపాదనలు మోదీకి అందజేసిన విషయం అందరికి తెలిసిందే

బయ్యారం ఉక్కు కర్మాగారం విభజన చట్టంలో పేర్కొన్న విధంగా ఏర్పాటు చేయాలని కోరాం.

ఐటీఐఆర్ విషయంలో రాష్ట్రానికి సహకరించాలని కోరాం

బయ్యారం, ఐటీఐఆర్ పై సంబంధిత మంత్రితో అదనపు సమాచారం ఇవ్వాలని గత సమావేశంలో సీఎం కేసీఆర్ ను మోదీ అడిగారు.

సీఎం ఆదేశాలతో
మరింత సమాచారం, వివరాలతో కూడిన నివేదిక అందించా.

ఐటీ రంగంలో రాష్ట్రం ఎలా ముందుకు పోతుందో వివరమైన నివేదిక ఇచ్చాము.

జాతీయ సగటులో తెలంగాణ రాష్ట్రం ఎక్కువగా ఉన్నదని ప్రధానికి తెలిపా

బయ్యారం ఉక్కు కర్మగారం పై కేంద్రం ముందుకు రాకపోతే ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకుంటాం

ఈ ప్రాజెక్టుల కోసం నాలుగేళ్లుగా రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న కృషి, చొరవను వివరించాం

15 వేల మంది గిరిజనులకు బయ్యారం తో ఉపాధి కలగనుంది

ఒడిశాలోని బైలాడిల్లా నుంచి ఇనుప ఖనిజాన్ని బయ్యారానికి తరలించేందుకు అవసరమైన రైలు మార్గ నిర్మాణ వ్యయంలో సహకరించేందుకు సిద్ధంగా ఉన్నాం

— కేటీఆర్, మంత్రి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *