అమరావతి : భారతీయ జనతా పార్టీకి కన్నా లక్ష్మినారాయణ అధ్యక్షుడిగా ఉన్నా, అసలు అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని ఆంధ్రప్రదేశ్ సమాచార శాఖ మంత్రి కాల్వ శ్రీనివాసులు ఘాటయిన కవ్వించే విమర్శించారు.
ఈ రోజు ఆయన విలేకరులతో మాట్లాడుతూ వైసిపి , బిజెపి అనుబంధాన్నిఒక చిన్న ముక్కలో చెప్పారు. వాళ్లదంతా ‘పైన విడివిగి లోన కలివిడి’ అన్నారు. కాల్వ శ్రీనివాసులు ఇంకా ఏమన్నారో చూడండి:
* బీజేపీ, వైసీపీ లమధ్య లోపాయికారీ ఒప్పందాలు ఉన్నాయని ఇప్పటికే చాలా సార్లు రుజువైంది.
*పైకి విడి విడిగా ఉన్నట్టు కనపడినా.. లోపల మాత్రం కలివిడిగానే ఉంటున్నారు.
* ఎన్నికలకు ఇంకా 11 నెలల సమయం ఉండగా ..6 నెలల్లోనే వస్తాయని జగన్ అనడం చూస్తుంటే ఎన్నికలు ముందుగా వస్తాయని బీజేపీ నుండి వైసీపీ కి సమచారం అందిందని తెలుస్తుంది.
* బీజేపీ ఏపీ శాఖకు రహస్య అధ్యక్షుడు జగన్
* ఎవ్వరూ అడగకముందే ఢిల్లీ రహస్యం గా వెళ్లి రాష్ట్రపతి ఎన్నికల్లో బీజేపీకి భేషరతు గా మద్దతు ఇచ్చింది జగన్ కాదా?
* ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తేనే బీజేపీకి మద్దతు ఇస్తామని అప్పుడే జగన్ ఎందుకు డిమాండ్ చెయ్యలేదు.
* రాష్ట్రంలో బీజేపీ అజెండా ను వైసీపీ అమలు చేస్తోంది.
*టీడీపీ పై విషం చిమ్మడానికే ఆ రెండు పార్టీలు ప్రయత్నిస్తున్నాయి.