తెలుగోళ్లు ఎక్కడైనా దేవుణ్ణి చూస్తారు, ఎవరిలోనైనా దేవుడిని కనిపెడతారు. అందుకే తెలుగు నాట ఉన్నంత మంది బాబాలు మరేరాష్ట్రంలోనూ ఉండరు. ఈ మధ్య నార్తోళ్లు కూడా ఇక్కడికే వచ్చి సెటిలవుతున్నారు. ఇలా ముందుకు వచ్చే వాళ్లకి ఇక్కడి ప్రభుత్వాలు కూడా బాగా ప్రోత్సాహం ఇస్తున్నాయి. వూరూరుకు కాకపోయినా, ప్రతిమండలంలో చిన్నవాడో పెద్దవాాడో ఒక బాబాను సృష్టించుకుని తరించిపోతుంటారు తెలుగోళ్లు. ఇపుడొక తెలంగాణ వాసికి అమెరికా అధ్యక్షుడు ట్రంపులో భగవంతుడు కన్పించాడు. అదే కథేందో చూడండి.
జనగాం జిల్లాలో కొన్నే గ్రామం ఉంది. అక్కడ బుస్సా కృష్ణ అనే వ్యక్తి ఉన్నాడు. ట్రంప్ నిత్యపారాయణం చేస్తూంటాడు. ఈ గౌరవం ముఖ్యమంత్రి కెసిఆర్ కు గాని, ప్రధాని నరేంద్ మోదీకి గాని దక్కలేదు. బ్లేడ్ తో వేలు కోసుకుని ట్ంపుకు రక్త తిలకం దిద్దుతాడు. పాలతో అభిషేకం చేస్తాడు. హారతి పడతాడు. ట్రంపు వాళ్లదేశానికి ఎంతో మేలు చేస్తున్నాడని, ఆయన వల్ల భారత దేశానికి మేలు జరుతుగుతుందని చెబుతాడు.
క్రిష్ణ ప్రార్థన వృధాకాలేదు. అమెరికా వైట్ హౌస్ కు ఈ ప్రార్థన చేరింది. ట్రంప్ పొంగిపోయారు. క్రిష్ణను మెచ్చుకుంటూ ట్వీట్ చేశాడు. అంతేకాదు,క్రిష్ ను కలుసుకుంటానని కూడా చెప్పాడు.