తమిళనాడులోని తిరువల్లూర్ ప్రభుత్వపాఠశాలలో 6- 10 తరగతుల విద్యార్థులకు పాఠాలు చెప్పే ఇంగ్లీష్ టీచర్ భగవాన్ కి వేరే చోటుకి బదిలీ ఆయిన నేపథ్యంలో , చివరి రోజు బడి వదిలి బయటకు వెళ్తుంటే ఆయన విద్యార్థులంతా ఇలా చుట్టు ముట్టి తమ ప్రేమతో ఆయన్ని బంధించేసి అడుగు ముందుకు పడకుండా అడ్డు నిలిచారు. ప్రాణం పోతున్నంత బాధతో వెక్కి వెక్కి ఏడ్చారు.
ఎంతటి హృద్యమైన దృశ్యం ఇది. అంతటి అభిమానం పొందగలిగిన ఆయన జన్మది ఎంత అదృష్టం కదా…
ఈ దృశ్యాలు చూసి అక్కడి అధికారులు ఆయన బదిలీ ఉత్తర్వులను పదిరోజుల పాటు తాత్కాలికంగా నిలిపి వేశారు. ఆ తరువాత ఆయన అక్కడ కొనసాగేది లేనిది నిర్ణయిస్తారుట.
ఈ గొప్ప గురువు – ఆ గొప్ప శిష్యుల బంధం చెదరకుండా భగవాన్ గారు అదే పాఠశాలలో కొనసాగాలని ఆశిద్దాం.