మన దేశంలో ఎంతో మంది బాబాలు ఉన్నారు అందులో కొందరు ప్రజల మంచి కొరకు పాటుపడేవారు అయితే, మరీకొందరు ప్రజలను బురిడీ కొట్టించి పబ్బం గడుపుకునేవారు. రెండో కోవకు చెందిన బాబా బాగోతం ఒకటి తెలంగాణలో వెలుగులోకి వచ్చింది. ప్రస్తుతం సోషల్ మీడియాలో బాగా ప్రచారం జరుగుతున్న బాబా సిద్ధ గురు రమణనంద మహర్షి గుట్టు రట్టు అవుతున్నది. ఇంతకూ ఎవరీ మహర్షి? ఏంటా కథ అనుకుంటున్నారా అయితే ఈ స్టోరీ చదవాల్సిందే.
భక్తి, సంప్రదాయాల ముసుగులో అనైతిక కార్యకలాపాలకు పాల్పడే ఈ బాబాల విషయంలో జాగ్రత్తగా ఉండాలని ప్రభుత్వాలు చెబుతూనే ఉన్నాయి. నకిలీ బాబాల వలలో పడి ఎంతో మంది తమ జీవితాలను, తమ ఆస్తులను పోగొట్టుకున్నవారు ఉన్నారు. ఈమధ్య కాలంలోనే దొంగా బాబాలుగా …. ఆశారాం బాపు, రాధే మా, సచ్ఛిందానంద గిరి అలియాస్ సచిన్ దత్తా, గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్ అలియాస్ డేరా బాబా, ఇచ్ఛాధారి భీమానంద్, మల్ఖాన్ సింగ్, నారాయణ్ సాయి, రాంపాల్, ఆచార్య కుష్మిని, స్వామి అసీమానంద, బృహస్పతి గిరి, ఓం నమ:శివాయ బాబా, నిర్మల్ బాబా చరిత్రపుటల్లోకి ఎక్కారు. తాజాగా ఇదే బాటలో భువనగిరిలో రమణ నంద మహర్షి బాబా వెలుగులోకి వచ్చాడు.
యాదాద్రి భువనగిరి జిల్లాలోని భువనగిరి మండలంలోని నాగిరెడ్డిపల్లి అనే గ్రామంలో రమణానంద మహర్షి పీఠం ఏర్పాటు చేయబడింది. దీన్ని 2012లో నెలకొల్పారు. 300 ఎకరాల్లో ఈ పీఠం విస్తరించింది ఉంది. అప్పటినుంచి ఇక్కడ భక్తిరస కార్యక్రమాలు సాగుతున్నాయి. సిద్ధ గురువు పేరుతో రమణ నంద మహర్షి చేసే గారడీలు అన్నీ ఇన్ని కాదు.
ఇక్కడ శక్తి పాతనికి ఒక రేటు దర్శనానికి ఓ రేటు, తన పీఠంలో విగ్రహ ప్రతిష్టకు ఓ రేటు, హోమానికి ఒక రేటు.. ఇలా చెప్పుకుంటూ పోతే రేట్ల బాబా కాస్త కేటు బాబా అనీ తేలిపోయిందని అతని భక్తులు లబోదిబో మంటున్నారు. మాకు ముక్తిని ప్రసాదిస్తాడు అనుకుంటే, ఈ బాబా విదేశాల్లో ముక్తి కోసం వెళ్లి బీచ్ లలో నెక్కరు వేసుకుని తిరుగుతూ ఫొటోలు దిగడాన్ని భక్తులు జీర్ణించుకోలేకపోతున్నారు. మహర్షి బికినీ ఫోటోలు సోషల్ మీడియా లో హల్ చల్ చేస్తున్నాయి. దీంతో అవి కాస్త వైరల్ కావడంతో ఇతనో తెలంగాణ మినీ డేరా బాబా అనీ ప్రచారం జోరందుకుంది. దీంతో భువనగిరి వాసులు బాబా పై నిప్పులు చెరుగుతున్నారు..
బాబా మరిన్ని బాగోతాలు.. పార్ట్ 2 స్టోరీ కోసం మరి కొద్ది గంటలు వెయిట్ చేయండి.
* రచయిత : వినయ్ కోసిక, జర్నలిస్టు. యాదాద్రి జిల్లా.