మహేష్‌బాబు చెల్లెలును వివాహం చేసుకున్న సుధీర్‌బాబు ఎస్ఎమ్ఎస్ సినిమాతో హీరోగా మారాడు. ఇక అప్పటి నుంచి అప్పుడప్పుడు సినిమాలు చేస్తూ వచ్చినా హీరోగా ఇప్పటి వరకు సుధీర్‌బాబుకు సరైన బ్రేక్ రాలేదు. అయితే సుధీర్‌బాబుకు సినిమాలు రికమెండ్ చేయడం కానీ.. అతను హీరోగా స్థిరపడటానికి ప్రిన్స్ మహేష్‌బాబు ఇప్పటి వరకు చేసింది ఏమీ లేదు.
ఈ విషయాన్ని ఇటీవల జరిగిన సుధీర్‌బాబు నటించిన తాజా చిత్రం ప్రీ రిలీజ్ వేడుకలో సుధీర్ ఆడియో వేడుకలకు రావడం తప్ప నా నుంచి ఆయనకు ఎటువంటి సపోర్ట్ అందలేదు అని మహేష్ కూడా ఆ వేదికపై చెప్పిన సంగతి తెలిసిందే. బావ కళ్లలో ఆనందం చూడటం కోసం మహేష్ ఏమీ చేయడం లేదనే అసంతృప్తి సుధీర్‌బాబు మనసులో కూడా వుండేదేమో… ఇప్పటి వరకు ఆ విషయాన్ని బహిరంగంగా ఎక్కడా చెప్పని సుధీర్‌బాబు తాజాగా సమ్మోహనం చిత్ర ప్రమోషన్లో భాగంగా నిర్వహించిన ఇంటర్వ్యూల్లో సినిమాలు కేవలం నా సంతృప్తి కోసమే చేస్తున్నాను. అసలు నాకు సినిమాలు చేయాల్సిన అవసరం లేదు. మా నాన్నకు వున్న వ్యాపారాలు చూస్తూ సంతకలు పెట్టిన సరిపోతుంది. అవకాశాల కోసం ఒకరిని అడగాల్సిన అవసరం నాకు లేదు. మహేష్‌ను కూడా అడగాల్సిన అవసరం అసలు లేదు. అలా ఒకరిని అడిగి బతికితే గౌరవం వుండదు అంటూ ఉద్వేగంగా తన మనసులోని భావాలను బయటపెట్టాడు సుధీర్