చాలా కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న మాజీ ప్రధాని అటల్ బిహారీ పేయిని న్యూఢిల్లీలోని ఎయిమ్స్ తరలించారు. ఈ విషయాన్ని భారతీయ జనతా పార్టీ కేంద్ర కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది.
లిబరల్ బిజెపి కి నాయకత్వం వహించిన వాజ్ పేయి సొంతంగా పార్టీని అధికారంలోకి తీసుకురాలేకపోయినా, పార్టీ గౌరవాన్ని కాపాడుతూవచ్చిన పాతతరం పెద్దాయన. 2004లో కాంగ్రెస్ నాయకత్వంలోకి యుపిఎ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఆయన రాజకీయాలనుంచి తప్పుకున్నారు. దానికి ఆనారోగ్యం కూడ తోడయింది. అప్పటినుంచి ఆయన వైద్యుల పర్యవేక్షణలోనే ఉన్నారు. దాదాపు మిత్రులను కూడా గుర్తించే స్థితిలో లేరని సమాచారం. ఇపుడు ఆయనను ఆసుపత్రిలో చేర్చడంతో అభిమానుల్లో ఆందోళన మొదలయింది.
అయితే, ఇది ప్రమాదమేమీ కాదని, రోటీ న్ పరీక్ష ల కోసమేనని పార్టీ తెలిపింది.
ఎయిమ్స్ డైరెక్టర్ జనరల్ డాక్టర్ రణ్ దీప్ గులేరియా ఆధ్వర్యంలో ఆయన వైద్య పరీక్షలు కొనసాగుతున్నాయి.
ఆయన సలహా మేరకే వాజ్ పేయిని ఆసుప్రతిలో చేర్పించినట్లు కూడా బిజెపి తెలిపింది.
వాజ్పేయికి 92 సంవత్సరాలు. 1998-2004 మధ్య బిజెపి నాయకత్వంలోని ఎన్ డి ఎ ప్రభుత్వంలో ఆయన ప్రధానమంత్రిగా ఉన్నారు. ఆతర్వాత ఆయన అస్వస్థత కారణంగా రాజకీయాలనుంచి కనుమరుగయ్యారు. ఇంటికే పరిమితమయ్యారు.
వాజ్ పేయి కాలంలో ఎన్డీ యే బలంగా ఉండేది. మిత్ర పక్షాలకు చాలా గౌరవం ఇచ్చే వారు. అందుకే ఆయనకాలంలో బిజెపి పుంజుకోలేకపోయినా,ఎన్డిఎ బలపడింది. అయితే రాజకీయాల నుంచి తెరమరుగుకావడంతో ఎన్ డి ఎ బలహీనపడింది. నరేంద్ర మోదీ తరహా బిజెపి తీవ్రవాదం పుంజుకోవడంతో ఎన్ డి ఎ మిత్రపక్షాలు ఒకొటొకటే దూరమవుతూ వచ్చాయి. ఇపుడు మిత్రులు లేరు, బిజెపి ప్రాబల్యం పడిపోతూ ఉంది.