కడప జిల్లా ప్రొద్దుటూరు మాజీ శాసన సభ్యుడు వరదరాజులురెడ్డి టిడిపి నేత సిఎం రమేష్ మీద తీవ్రమయిన ఆరోపణలు చేశారు. కాంట్రాక్టర్లనుంచి భారీ కమిషన్ బలవంతంగా వసూలు చేస్తున్నాడన్నది ప్రధానమయిన ఆరోపణ. వరదరాజులు రెడ్డి నోటనే ఈ అరోపణలు వినండి:
ఫ్యాక్షన్ కుటుంబం నుంచి వచ్చి కడప జిల్లా టీడీపీలో చిచ్చు పెడుతున్నావ్… నేరుగా ఈ ఎన్నికల్లో గెలిచే సత్తా లేదు. పంచాయతీ కి ఎక్కువ, మండలానికి తక్కువ. ప్రొద్దుటూరు, జమ్మలమడుగు, కడప, కమలాపురం, బద్వేలు, రాయఛోతే, రాజంపేటలో చిచ్చు పెట్టి గెలిచే చోట గెలావకుండా చేస్తున్నావు.. నామినేటెడ్ పడవులతో పబ్బం గాడుపుకునే నీకు వర్గ రాజకీయాలు ఎందుకు. కుందూ పెన్నా కాంట్రాక్ట్ పనిలో 5 శాతం కమిషన్లు ఎందుకు ఇవ్వాలి.. నువ్వేమన్నా దాదావా..ప్రొద్దుటూరు లో అభివృద్ధిని అడ్డుకుంటున్నావ్.. నువ్వు వైస్సార్ జగన్ పార్టీతో చేతులు కలిపి, జిల్లాలో పార్టీని దెబ్బ తీస్తున్నైవ్.. కోట్ల రూపాయలు ఎలా సంపాదించావో అందరికి తెలుసు.. 3500 కోట్ల పనులు చేస్తున్నావ్.. బ్యాంకులకు తప్పుడు పాత్రలు ఇచ్చి, రుణాలు తీసుకున్నావ్.. ప్రోద్దతుర్ మునిసిపాలిటీ వ్యవహారంలో నీ జోక్యం కారణంగానే సమస్యలు వస్తున్నాయ్.