ఆంధ్రప్రదేశ్ ఇంకా ఇలాంటి పరిస్థితి ఉంది. చాలా గ్రామాలకు ఇంకా రోడ్డు లేవు. వైద్య వసతి అందుబాటులో లేదు. ఇలాంటిదే విశాఖ లోని అనుకు గ్రామం . మీడియా రిపోర్టుల ప్రకారం, ఈ గ్రామాలలోకి అత్యవసర పరిస్థితులలో అంబులెన్స్ కూడా వెళ్ల లేదు. అందుకే ఒక ప్రసవానికి వచ్చిన ఒక మహిళలను ఆదుకునేందుకు 108 వాహనం రాలేకపోయింది. దానితో ఆమె ఇలా దుప్పట్లో చేసిన డోలీలో సమీపంలోని ఆసుపత్రికి తీసుకురావలసి వచ్చింది. అధికార పార్టీ వాళ్లు ఆంధ్రప్రదేశ్ నవ్యాంధ్ర అని పిల్చుకుంటూ ఉంటారు. ఇలాంటి ఆంధ్రప్రదేశ్ లో సంతోషం పెరిగిందని ముఖ్యమంత్రిచంద్రబాబు నాయుడు ప్రతి మీటింగులో చెబుతుంటారు.