వాట్సాప్ గ్రూపుల్లో వైరలవుతున్న కామెంట్ ఇది. వచ్చేది వర్షాకాలం. హైదరాబాద్ ఎలా ఉంటున్నదో చెప్పేందుకు టైటానిక్ ఫోటో నువాడి అద్భతంగా చెప్పిన ఈ మూడు ముక్కలను వాట్సాప్ గ్రూపులు తెగ షేర్ చేస్తున్నాయి.ముఖ్యమంత్రి తండ్రి నుంచి గిఫ్ట్ గా మునిసిపల్ శాఖను పొందిని కెటి రామారావు నూరు రోజుల తర్వాత జిహెచ్ ఎమ్ సి కి ‘అచ్ఛేదిన్ ’ వచ్చేస్తాయన్నారు. నూర్రోజులు పోయాయి. మూడేళ్ల యింది. హైదరాబాద్ రోడ్డు బాగు పడలేదు. గుంతలు పూడ లేదు. చిన్న వర్షం వచ్చినా నగరం మడుగవుతుంది. ఇవాంక వచ్చిన సందర్బంగా హైదరాబాద్ నంతా గాలికొదిలేసి ఆమె తిరిగాల్సిన రోడ్లను తెగ ముస్తాబుచేశారు. ఆ రోడ్డు కూడా ఇపుడు కొట్టుకుపోయాయి. అందుకే ఎవరో రసజ్ఞుడు టైటానిక్ ను గొప్పగా గుర్తు చేస్తూ హైదరాబాద్ పౌరులను ఇలా హెచ్చరించారు.