హైదరాబాద్ లో మరో ఘాతకం. కామాంధుడి ఉచ్చులో సాఫ్ట్ వేర్ ఉద్యోగిని బలిఅయింది. పెళ్లి పేరిట ఆ యువతిని మోసం చేశాడు ఉపేందర్ వర్మ అనే వ్యక్తి. వివరాలు…
ఉపేందర్ ఎవరో కాదు, సిటిలో పేరున్న ఒక పాన్ హౌస్ ఓనర్, అతగాడికి హిమయత్ నగర్ తో పాటు సిటీలో పలుచోట్ల పాన్ హౌసులున్నాయి.ఉపేందర్ ఫేస్బుక్ రిక్వెస్ట్లు పంపి అమ్మాయిలను ట్రాప్ చేస్తుంటాడు. అంతేకాదు, అశ్లీల వీడియోలు తీసి, యూట్యూబ్లో వీడియో లో అప్లోడ్ చేస్తానని అని బెదిరించడం కూడా చేస్తుంటాడు. బయటకు పొక్కిన సమాచారం ప్రకారం, ఇతగాడు తన పాన్ బిజినెస్ ను కూడా తన నేరాలకు టూల్ గా వాడుకునేవాడు. స్వీట్ పాన్ లో మత్తు పదార్థాలు కలిపి ఇచ్చి పలుమార్లు అత్యాచారం చేశాడని తెలిసింది.ఇలా మోసపోయిన ఈ అమ్మాయి న్యాయం కోసం కాచిగూడ పోలీసులను ఆశ్రయించింది.
నిందితుడు ఉపేంద్ర వర్మపై రేప్ కేసు తోపాటు పలు కేసులు నమోదుచేసి కాచిగూడ పోలీసులుఅరెస్టు చేశారు.
పరారీలో ఉన్న ఉపేంద్ర వర్మ కు సహకరించిన స్నేహితులు రాజేష్ తో పాటు మరో ఇద్దరిని కూడాపోలీసులు పట్టుకునేందుకు చూస్తున్నారు.