ప్రధాని నరేంద్ర మోదీకి ఆంధ్రప్రదేశ్ ఐటి మంత్రి చరక అంటించారు. జూన్ రెండో తేదీన రాష్ట్రావతరణ అంటూ ప్రధాని మోదీ ఆంధ్రులకు అభినందనలు చెప్పారు ట్విట్టర్ లో ఇలా…
Greetings to my sisters and brothers of Andhra Pradesh. I pray for the good health and prosperity of the people of the state.
— Narendra Modi (@narendramodi) 2 June 2018
అయితే, ఇలాంటి ఉత్తుత్తి ట్వీట్లతో ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆగ్రహాన్ని చల్లార్చలేవని ఆయన ప్రధానిమోదీకి ట్విట్టర్ లోనే జవాబిచ్చారు. ఇలా కపట ప్రేమచూపి, అట్టుడుకుతున్న రాష్ట్రాన్ని చల్లబర్చవచ్చని మీరు అనుకుంటున్నారేమే, అయితే, మీ ట్వీట్ కింద వచ్చిన రియాక్షన్లు ఒక సారి చూడండి, మోదీ సర్, అని మోదీ వేలుతోనే మోదీ కళ్లు పొడిచాడు లోకేశ్. దానికి సాక్ష్యంగా ఆయన కొన్ని రియాక్షన్లను కూడా జతపరిచారు. ఇవిగో చదవండి:
Dear @narendramodi Sir, if you thought your tweet could cool down AP that’s on the boil for its rights, you must read the comments section which I have attached (only a few) for your perusal. Hope it doesn’t spoil your Monday #APDemandsSpecialStatus #APDemandsJustice #MondayBlues pic.twitter.com/48nx981QKR
— Lokesh Nara (@naralokesh) 4 June 2018