రాణి రుద్రమ పేరు తెలంగాణ ప్రజలకు సుపరిచితమే. ఆమె తెలంగాణ ఉద్యమ కాలంలో టిన్యూస్ లో పనిచేశారు. తనదైన యాంకరింగ్ ద్వారా తెలంగాణ ఉద్యమాన్ని కొత్త పుంతలు తొక్కించారు. తెలంగాణ కు జరుగుతున్న అన్యాయాల మీద గళమెత్తారు. చర్చా వేదికలు, ప్రత్యేక కథనాల ద్వారా తెలంగాణ ఉద్యమాన్ని ముందుకు తీసుకు పోయారు.
కానీ ఆమె అనంతర కాలంలో రాజకీయాల్లో చేరారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. కానీ తెలంగాణ వచ్చిన తర్వాత ఆ పార్టీ తెలంగాణలో కనుమరుగైపోయింది. ఆ పార్టీలో ఉన్న కొండా సురేఖ, బాజిరెడ్డి గోవర్దన్ లాంటి పెద్ద లీడర్లు కూడా ఆ పార్టీని వీడి టిఆర్ఎస్ లో చేరిపోయారు. తర్వాత ఎమ్మెల్యేలు అయ్యారు. కానీ రాణి రుద్రమ వైసిపిని వీడిన తర్వాత క్రియాశీల రాజకీయాలకు దూరంగా ఉన్నారు. మీడియాకు కూడా కొంతకాలం దూరంగా ఉన్నారు. తాజాగా మళ్లీ హెచ్ఎం టివి వారు నిర్వహించే దశ దిశ కార్యక్రమం ద్వారా మీడియాలోకి రీ ఎంట్రీ ఇచ్చారు.
అయితే ఆదివారం జరిగిన దశ దిశ కార్యక్రమం రచ్చ రచ్చ అయింది. టిఆర్ఎస్ నేతలు బాల్క సుమన్, రాజేష్ ఇద్దరూ రాణిరుద్రమతో వాగ్వాదానికి దిగారు. రాజేష్ పరుషంగా మాట్లాడడంతో సభలో గందరగోళం నెలకొంది. రాణి రుద్రమ కూడా టిఆర్ఎస్ నేతలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. భాష సరిగా మాట్లాడాలని చురకలు వేశారు. ఆ వీడియో కింద ఉంది చూడండి.