సాధారణంగా ముఖ్యమంత్రుల ప్రశ్నోత్తరాలు, డయల్ యువర్ సిఎం వంటి కార్యక్రమాలలో చాలా జోక్స్ ఉంటాయి. ఇందులో ప్రశ్నలడిగే వాళ్లకు ముందే ప్రశ్నలిస్తారు. ఫోన్ ఇన్ చేసేవాళ్లు పక్క రూంలోనే ఉంటారు. పూర్వం ఆంధ్రప్రదేశ్ లో ఒక ముఖ్యమంత్రి డయల్ యువర్ సిఎం ప్రోగ్రాం కు కొంతమంది జర్నలిస్టులు కూడా పక్కరూం నుంచే ఫోన్ చేసేవాళ్లు. ఏదో ఇమేజ్ కోసం ముఖ్యమంత్రులు, ఇతర ప్రభుత్వ ప్రముఖులు ఇలాంటి డ్రా మాలువేస్తుంటారు. ఈ మధ్య సింగపూర్ పర్యటనలో ప్రధాని నరేంద్ర మోదీ కూడా ఇలాంటి డ్రామాలో చిక్కుకున్నారు. అక్కడ నాన్యాంగ్ టెక్నికల్ యూనివర్శిటీ ప్రెసిడెంట్ సుబ్ర సురేష్ ప్రత్యేక ఆహ్వానించిన ప్రేక్షకుల మధ్య ప్రధానిని ఇంటర్వ్యూ చేశారు.‘Transforming Asia Through Innovation’ ప్రోగ్రామ్ లో భాగంగా ప్రధానిని సురేష్ ఇంటర్వ్యూ చేశారు. అంతవరకు బాగానే ఉంది. ప్రధాని కార్యక్రమానికి ప్రేక్షకుల నుంచి ప్రశ్నలు ఆహ్వానించారు. అయితే, తమాషా ఏమిటంటే, ప్రశ్నల న్నీంటి నిర్వాహకులే ప్రేక్షకులకు ముందే అందించారు. ఒకచోట పప్పులో కాలేసి ఒకరికి ప్రశ్న ఇవ్వబోయి, ప్రధాని చెప్పాల్సిన జవాబుల్లో నుంచి ఒక పేజీ ఇచ్చారు. అదే తాను చదవాల్సిందనుకుని, ఒక అమ్మడు ఆ పేజీనంతా చదివేసింది. ప్రధాని, సురేష్ ఒకరి ముఖాలొకరు చూసుకున్నారు. 2.9 నిమిషాలు వీడియో మొత్తం చూడండి. మీకే తెలుస్తుంది విషయమేమిటో…