గల్ఫ్ కార్మికులు తెలంగాణ బిడ్డలు కాదా?

తెలంగాణ ప్రభుత్వానికి వ్యతిరేకంగా తెలంగాణ గల్ప్ కార్మికులు పోరాట బాటపడుతున్నారు. గల్ప్ ఎన్ ఆర్ ఐ పాలసీ తీసుకురావడంలో జరుగుతున్న జాప్యాన్ని నిరసిస్తూ పోరాటానికి పూనుకోవాలని గల్ఫ్ కార్మికుల అవగాహనా వేదిక కార్యాచరణ ప్రకటించింది. గల్ఫ్ దేశాలలో ఉన్న తెలంగాణ కార్మికులను ఈ ఉద్యమంలోకి  తీసుకువచ్చేందుకు వేదిక నాయకులు అన్ని గల్ఫ్ దేశాలు తిగిరి ఎన్ఆర్ ఐ పాలసీ తీసుకురావడంలో టిఆర్ ఎస్ ప్రభుత్వ వైఫల్యం గురించి వివరిస్తారు. టిఆర్ ఎస్ ప్రభుత్వం తమ కు ద్రోహం చేసిందని వారు భావిస్తున్నారు. ఈ పరిస్థితులలో తెలంగాణ ఆవిర్భావం దినం సంబురం ఎలా అవుతుందని చెబుతూ ఈ సందర్భాన్ని తమ నిరసన తెలిపేందుకు వాడుకుంటున్నామని వారు ప్రకటించారు. తెలంగాణ గల్ఫ్ కార్మికులను తెలంగాణ బిడ్డలుగా చూడటం లేదని, అందుకే గల్ఫ్ కార్మికుల సంక్షేమం కోసం ఒక్క పని చేయలేదని చెబుతూ ఈ వేదికనాయకుడు దొనికెని కృష్ణ , తెలంగాణ ప్రభుత్వానికి చెమటలు పట్టిస్తామని హెచ్చరిక చేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఉద్యమాన్ని ఉన్నత స్థాయికి తీసుకువెళ్లేందుకు, 10 లక్షల మంది కార్మికులు మేలుకోసం అక్టోబర్ 11, ఎల్ బి నగర్ ధర్నా చౌక్ వద్ద ఆమరణ నిరాహార దీక్ష చేపడతానని ఆయన చెప్పారు.

ఇదే వీడియో.

https://www.facebook.com/GWACUAE/videos/210968746296720/

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *