ఆవకాయ పచ్చడి ఏంట్రా… మీ సంకర భాషని పాతెయ్య. అసలు పచ్చళ్లంటే ఏంటో, తొక్కు అంటే ఏంటో, ఊరగాయ అంటే ఏంటో తెలియకుండా ఏం బతుకుతున్నారు దిక్కుమాలిన గోలా?ఉప్పుకారాలు మిశ్రమించి నూనె కలిపి ఊరేస్తే ఊరగాయ అంటారు. ఆవకాయ, మాగాయా మెంతికాయా వంటివి. దంచి చేసిన దాన్ని తొక్కు అంటారు. చింతకాయ వంటివి.తరిగి, వాడ్చి, లేదా నానా పెట్టి రుబ్బి చేసేవి పచ్చళ్ళు. కొబ్బరి పచ్చడి, గోంగూర పచ్చడి, కొత్తిమీర పచ్చడి టమేటా, కంది పచ్చడి ఇటువంటివి. అంతే గానీ ప్రతీదీ పచ్చడి అనరు. మీ మొహాలు సంతకెళ్ళ. తిని ఏడవడం రాకపోతే పోయింది అసలు దేన్ని ఏం అంటారో కూడా తెలిసి చావక పోతే ఎలాగర్రా. ఇంతకీ కొత్తావకాయలో మీగడ తరగ నంజుకు తింటున్నారా. ఒక రోజు మజ్జిగ పులుసెట్టుకుని మాగాయా టెంక నంజుకు తిని ఏడవండి. మహా రంజుగా ఉంటుంది. వెధవ సోకులకు పోకుండా పెద్దరసాల పండు పెరుగు లో వేసుకు జుర్రుకు తినండి. ఏ కాలం పండు ఆ కాలం లో తినాలి.రోజూ మూడు పూటలా మజ్జిగ తాగి అఘోరించండి, వేడి చేసి ఏడవకుండా ఉంటుంది.
-పచ్చళ్ల పంతులు