దగా
అవ్ మరి
నువ్వు దాన్ని
ప్రగతి భవన్ అంటున్నవ్
నిజంగా మేం దాన్ని
పాముల పుట్ట అంటున్నం.
అవ్ మరి
నువ్వు నాది
ప్రజారంజక పాలనని
పెగ్గెలు కొడుతున్నవ్
కానేకాదది
ఉత్త ప్రేలాపనని మేమంటున్నం
…. … … …
అభాగ్యులకు
అన్నార్తులకు
అడుగు పెట్టే
అనుమతే లేనప్పుడు
దాన్ని మేం
దొరల గడీ
దోపిడీల అడ్డా అంటున్నం
అయినోళ్లనూ
అవసరం ఉన్నోళ్లనూ
ఆహ్వానించి
ఆలింగనం చేస్కొని
అంగలార్చే చోద్యమంతా చూస్తున్నం
కానోళ్లచ్చి కాళ్ళు పట్టుకుంటే
కర్కశంగా కాలర్ పట్టి
ఈడ్చి పారేయిస్తున్నవ్
దీన్ని మేము
నిర్భయంగ నియంత
నిరంకుశ పాలనని
నినదిస్తున్నం
… … … …
ఏదేమైనా ఎవ్వడొచ్చినా
మమ్ముల్ని ఎవ్వడేలినా
పేదోళ్ళ బతుకు చిత్రం
మార్చనప్పుడూ మారనప్పుడూ
ఎన్ని కతల్ జెప్పినా
సంక్షేమ పథకాలెన్ని అమల్జేసినా
అంతా వృధా
కావల్సుకొని చేసే దగా.
(ఒక వాట్సాప్ గ్రూప్ నుంచి)