తెలంగాణలో ఎప్పుడెప్పుడు సర్పంచ్ ఎన్నికల్లో పోటీ చేయాలా అని ఉవ్విళ్లూరుతున్న అభ్యర్థుల కోసమే ఈ వార్త. జర్రంత ఓపికతో చదవండి.
హైదరాబాద్ లోని మారియట్ హోటల్ లో పంచాయతీ ఎన్నికల నిర్వహణపై జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో తెలంగాణ రాష్ఱ్ర ఎన్నకల కమిషనర్ నాగిరెడ్డి, డిజిపి మహేందర్ రెడ్డి ప్రత్యేకంగా సమావేశమయ్యారు. సమావేశంలో నాగిరెడ్డి మాట్లాడారు ఆయన మాటలు చదవండి.
జూలై నెలాఖరుకల్లా పంచాయతీ ఎన్నికలు పూర్తి చేయాలి. వచ్చే ఏడాది ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాలకు ఎన్నికలు జరుపుతాం. పంచాయతీ ఎన్నికల నిర్వహణ పెద్ద సవాల్ లాంటిది. పంచాయతీ ఎన్నికల్లో 1.5 కోట్ల ఓటర్లు పాల్గొంటారు. జీహెచ్ఎంసీ ఎన్నికల ఓటర్ల కంటే రెట్టింపు ఓటర్లు తమ ఓటుహక్కు వినియోగించుకుంటారు. బెంగాల్ పంచాయతీ ఎన్నికల్లో అన్ని జాగ్రత్తలు తీసుకున్నా 30 మంది చనిపోయారు. బాధాకరం. మన రాష్ట్రంలో ఎన్నికల నిర్వహణ చాలా సమర్థంగా ఉంటుంది. ఏడాది క్రితం నుంచే ఎన్నికల నిర్వహణ కసరత్తును ప్రారంభించాము. ఎట్టి పరిస్థితుల్లోనూ జులై లోగా ఎన్నికలు పూర్తి చేయాల్సిందే.
ఈ రెండు నెలల్లో కొత్తగా ఎన్నికలు పూర్తి పారదర్శకంగా, ప్రశాంతంగా జరిగేలా పటిష్ట ప్రణాళికలు రూపొందించాలి. ఎన్నకల నిర్వహణలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పోలీస్ శాఖ చర్యలు చేపట్టాలి. అవసరమైతే ఇతర రాష్ట్రాల నుంచి బలగాలను తీసుకోవాలి. ఇప్పటికే ఓటర్ల తుదిజాబితాలను సిద్ధం చేశాము. ముద్రణా సామాగ్రి అంతా జూన్ 15 కల్లా సిద్ధమవుతుంది. కలెక్టర్లు రిటర్నింగ్ అధికారులను గుర్తించి వెంటనే నియమించాలి. బ్యాలెట్ పత్రాల ముద్రణను జిల్లాల్లోనే చేపట్టాలి. సరిపడా బ్యాలెట్ బాక్సులు సిద్ధంగా ఉన్నాయి. సిబ్బంది నిర్వహణ మినహా మిగతా పనులను జూన్ పది లోగా పూర్తి చేసుకోవాలి. కొత్త రాష్ట్రంలో సరికొత్త నాయకత్వాన్ని ప్రజలు స్వేచ్ఛగా ఎన్నుకునే అవకాశాన్నికల్పించాల్సిన బాధ్యత మనపై ఉంది. భవిష్యత్ తెలంగాణకు పంచాయతీ ఎన్నికలు కీలక పునాది అవుతాయి. ఈ సమయంలో ఎలాంటి కార్యక్రమాలు చేపట్టవద్దని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నానని అన్నారు.
సమావేశంలో డిజిపి మహేందర్ రెడ్డి మాట్లాడారు. ఆయనేమన్నారో చదవండి.మిగతా ఎన్నికలతో పోలిస్తే చాలా తీవ్రమైన పోటీ ఉండే పంచాయతీ ఎన్నికలకు అవసరమైన ప్రణాళికలు రూపొందించుకోవాలి. చాలా మంది ఎస్పీలు మొదటిసారి పంచాయతీ ఎన్నికలు నిర్వహించబోతున్నారు. జిల్లా పోలీసు అధికారులకు ఎన్నికల నిర్వహణపై సమగ్ర అవగాహన ఉండాలి. సమస్యలు ఎక్కడ వచ్చే అవకాశం ఉందో ముందే గుర్తించి అవసరమైన చర్యలు తీసుకోవాలి. హైదరాబాద్, రాచకొండ, సైబరాబాద్, వరంగల్ కమీషనరేట్ల నుంచి కూడా పోలీస్ బలగాలను పంచాయతీ ఎన్నికల కోసం ఉపయోగిస్తాం. ఎక్సైజ్, అటవీ తదితర శాఖల సహకారం కూడా తీసుకొంటాము. ఎలాంటి సంఘటనలకు ఆస్కారం జరిగేలా ఎన్నికలు జరిగేలా చూడాలి. ప్రతి ఎస్పీ, కమిషనర్ కూడా ఒక్క ఘటన జరగరాదన్న లక్ష్యంతో పనిచేయాలి. ఎన్నికలు పూర్తయ్యాక కూడా ఎలాంటి ఘటనలు జరగకుండా చూడాలని ఆయన చెప్పారు.