తెలంగాణలో అధికార టీఆర్ఎస్ పార్టీ నాయకుల అరాచకకాలు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి అధికారం ఉంది కదా అని బరితెగిస్తున్నారు గులాబీ నేతలు. అధికార అండదండలతో రెచ్చిపోతున్న టీఆర్ఎస్ నేతలు మహిళలపై అత్యాచారాలకు పాల్పడుతున్నారు . ఇప్పటికే అనేకమంది టీఆర్ఎస్ నేతలు మహిళల వేధింపుల కేసుల్లో చిక్కుకోగా, తాజాగా నకిరేకల్ ఎమ్మెల్యే వేములవేరేశం అనుచరుడు వేముల నరేష్ మహిళపై అత్యాచారయత్నం చేయడం కలకలం రేపుతోంది.
శాలిగౌరారం మండలం, ఊట్కూరు గ్రామంలో తన స్నేహితుడి భార్య పై ఆయన అత్యాచారయత్నానికి పాల్పడ్డాడు. అన్నా వదిలిపెట్టూ అని ఆమె వేడుకుంటున్నా అతను కనికరించలేదు. కామ పిశాచిలా ఆమెకు అత్యాచారయత్నానికి పాల్పడ్డాడు నరేష్. దీంతో స్థానికులు ఫిర్యాదుతో సమాచారం అందుకున్న పోలీసులు అతనిని అరెస్ట్ చేశారు..నరేష్ ఎమ్మెల్యే స్వగ్రామం ఊట్కూరి వాసి. తెలంగాణ సాంస్కృతిక సారథి జిల్లా కోఆర్డినేటర్గా అతను పనిచేస్తున్నాడు.టీఆర్ఎస్ నేతలే మహిళలపై అత్యాచారాలకు పాల్పడుతుంటే రాష్ట్రంలో మహిళలకు రక్షణ ఏంటని మహిళలు ప్రశ్నిస్తున్నారు.
నియోజకవర్గంలో ఎమ్మెల్యే అండతో అనచరులు రెచ్చిపోతున్నారంటున్నారు స్థానిక ప్రజలు. గతంలో ఎమ్మేల్యే వీరేశం కాలేజ్ యాజమాన్యాలపై బెదిరింపులకు దిగాడు. అలాగే ఆయన సోదరుడు రామచంద్రయ్య గన్ల కేసులో దొరికిపోయాడు. దీంతో ఇలాంటి నేరచరిత్ర కలిగిన వ్యక్తులు ఎమ్మేల్యేలుగా కొనసాగడంపై ప్రజలు మండిపడుతున్నారు. ఎమ్మెల్యే, ఆయన అనచరులు అగడాలకు అడ్డుఅదుపు లేకుండా పోతుందని,వారి నుంచి తమను రక్షించాలని ప్రజలు కోరుకుంటున్నారు.