ఈ అమ్మాయి ఒక్క పోస్టుతో సోషల్ మీడియా షేక్

ఈమె పేరు సువర్ణ సంకసర్ల. సొంత ఊరు మంచిర్యాల జిల్లాలోని రామకృష్ణాపూర్. ప్రస్తుతం మంచిర్యాలలో మీడియా జర్నలిస్టుగా పనిచేస్తున్నారు. సువర్ణ చదివింది డిగ్రీ. తాజాగా ఫేస్ బుక్ లో ఈమె చేసిన ఒక్క పోస్టు ప్రస్తుతం హాట్ టాపిక్ అయింది. అక్షరాలా ఆమె పోస్టుకు 7వేలకు పైగా లైక్స్, 3500కు పైగా షేర్స్, 5వేలు కామెంట్స్. ఈ అమ్మాయి ఫేస్ బుక్ లో పెట్టిన అంత పవర్ ఫుల్ పోటు ఏందబ్బా అనుకుంటున్నారా? అయితే పూర్తి వివరాలు చదవండి. తెలంగాణ సర్కారు తీసుకున్న నిర్ణయాన్ని ప్రశ్నిస్తూ సువర్ణ ఫేస్ బుక్ లో పోస్టు చేశారు.

సువర్ణ గతంలో ఫ్యాషన్ డిజైనర్ గా పనిచేశారు. సుమారు వంద మందికి ఉపాధి కల్పించారు. ఆ తర్వాత కొంతకాలం పాటు మంచిర్యాల పోలీసు స్టేషన్ లో ఫ్యామిలీ కౌన్సెలర్ గా కూడా పనిచేశారు. కుటంబ కలహాలతో పోలీసు స్టేషన్ కు వచ్చిన కుటంబసభ్యులకు కౌన్సెలింగ్ ఇచ్చేవారు. అయితే ప్రస్తుతం ఆ వృత్తి మానేసి జర్నలిస్టుగా పనిచేస్తున్నారు.

సువర్ణ సామాజిక బాధ్యతతో చేసిన చాలా పోస్టులు వైరల్ అవుతున్నాయి. పెద్ద సంఖ్యలో షేర్స్, లైక్స్ తో అదిరిపోతున్నాయి. సమకాలీన రాజకీయ అంశాలతోపాటు, ప్రజా సమస్యలపై సువర్ణ పోస్టులు మంచిర్యాల ప్రజలనే కాకుండా తెలుగు ప్రజలను కూడా ఆలోచింపజేస్తున్నాయని అంటున్నారు. సువర్ణ ఫేస్ బుక్ లో చేసిన పోస్టు కింద ఉంది చూడండి.

 

https://www.facebook.com/photo.php?fbid=455984554860063&set=a.208255219632999.1073741829.100013455669044&type=3&theater

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *