కర్నాటక కాంగ్రెస్ ను విషాదంలో ముంచెత్తుతూ కొత్తగ ఎన్నికయిన ఎమ్మెల్యే సిద్దు బి న్యామాగౌడ సోమవారం తెల్ల వారు జామున ఒక రోడ్డు ప్రమాదంలో చనిపోయారు. ఆయన మాజీ కేంద్రమంత్రి కూడా. ఈ నెలలో జరిగిన ఎన్నికల్లో ఆయన జామఖండి నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్తిగా గెలుపొందారు. గోవానుంచి జామఖండికి తిరిగివస్తుండా తులసిగేరి వద్ద జరిగిన ప్రమాదంలో మరణించారు. గోవా విమానాశ్రయం నుంచి తెల్లవారుజామున 4.30 కి జామఖండి బయలుదేరారు. అయితే, ఆయన ప్రమాణిస్తున్న ఇన్నోవా కారు ఎడమ టైర్ టైర్ పగిలిపోవడం వాహనం పక్కన గోడకు ఢీకొనింది.ఆయనను వెంటనే ఆసుపత్రికి తరలించారు. అక్కడ ఆయన మృతి చెందినట్లు డాక్టర్లు చెప్పారు.
Congress MLA Siddu Nyama Gowda passed away in a road accident near Tulasigeri. He was on his way from Goa to Bagalkot. #Karnataka pic.twitter.com/0V8R9spaHh
— ANI (@ANI) 28 May 2018
ఈ మధ్య కాంగ్రెస్ తరఫున గెలుపొందిన 78 మంది ఎమ్మెల్యేలో ఆయన ఒకరు. కుమారస్వామి మంత్రి వర్గంలో ఆయన చోటు దొరకనుందని అనుకుంటున్నపుడు ఈ ప్రమాదం జరిగింది.
జామఖండి నియోజకవర్గంలో ఆయన బిజెపి అభ్యర్థఇ సుబ్బారావ్ కులకర్ణి మీద 2,500 వోట్ల ఆధిక్యతతో గెలుపొందారు.