కొద్ది సేపటిలో విజయవాడలో తెలుగుదేశం పార్టీ జాతీయ మహానాడు ప్రారంభం కాబోతున్నది. ఇది విజయవాడలో 3 మహానాడు. మొదటి మహానాడు 1983 లో జరిగింది. ఆ మహానాడు జరిగిన ప్రదేశము పేరు కి జ్ఞాపకంగా విజయవాడలో మహానాడురోడ్డు అని స్థిరపడింది.
రెండో మహానాడు 1988 లో జరిగింది. మళ్ళీ 30 ఏండ్లు తరువాత విజయవాడలో 3 మహానాడు జరగబోతోంది. ఇది టిడిపి చరిత్రలో కొత్త మలుపు కాబోతున్నది. టిడిపి రాజకీయాలు ఇక ముందు మారబోతున్నాయి. ఎన్టీయో తో తెగతెంపులు చేసుకుని ప్రధాని మీద ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు యుద్ధం ప్రకటించిననేపథ్యంలో ఈ సదస్సు జరుగుతున్నది. మొదటి మహానాడు తెలుగువాఢి ఆత్మగౌరవ ప్రతీకగా నాటి నేత ఎన్టీరామారావు కేంద్రం మీద యుద్ధభేరి మోగించారు.ఇపుడు ఆంధ్రోడి ఆత్మగౌరవంగా మోదీ మిత్రద్రోహానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమర శంఖారావం పూరిస్తారు.ఇక్కడేం ఎంజరుగబోతున్నదో, చంద్రబాబుబాబు ఏ లైన్ తీసుకోబుతున్నారో అధికారికంగా ప్రకటిస్తారని తెలుగుదేశం వర్గాలు ట్రెండింగ్ తెలుగున్యూస్ కు తెలపాయి.