జాలిముడి పనుల్లో అలక్ష్యం వద్దు, భట్టి సలహా

➡ ప్రాజెక్ట్ కుడి కాలువ పనులు పరిశీలన
➡ తాగునీటి సమస్య ఉండరాదు

మధిర, మే 20: జాలిముడి ప్రాజెక్టు పనుల్లో అధికారులు అలసత్వం ప్రదర్శించరాదని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ భట్టి విక్రమార్క చెప్పారు. జాలిముడి ప్రాజెక్ట్ కుడి కాలువ పనులను బోనకల్ మండలం రామన్నపేట ప్రాంతంలో ఆదివారం నాడు పరిశీలించారు.

ఈ సందర్భంగా కాలువ పనులు నెమ్మదిగా సాగుతున్నాయని భట్టి విక్రమార్కకు రైతులు ఫిర్యాదు చేశారు. అంతేకాక రామన్నపేట, మోటమర్రి, ఆళ్లపాడు గ్రామాలకు తాగునీరు రావడం లేదని ప్రజలు భట్టికి చెప్పారు. రైతులు, ప్రజల సమస్యలపై స్పందించిన భట్టి విక్రమార్క ఇరిగేషన్ ఉన్నతాధికారులతో మాట్లాడారు. రామన్నపేట కాలువవద్ద పెద్ద బండరాయి పడడంతో పనుల్లో ఆలస్యం జరుగుతోందని, వీలైనంత త్వరగా రాయిని పగలగొడతామని చెప్పారు. అంతేకాక అన్ని గ్రామాలకు తాగునీటికి ఇబ్బందులు లేకుండా చూస్తామని అధికారులు భట్టికి తెలిపారు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *