తెలంగాణలో అధికార టిఆర్ఎస్ నుంచి వలసలు మొదలైతున్న వాతావరణం నెలకొంది. నిన్నమొన్నటి వరకు టిఆర్ఎస్ లోకి జంప్ చేశారు పెద్ద ఎత్తున మిగతా పార్టీల లీడర్లు, నాయకులు. కానీ తాజాగా గద్వాలలో టిఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరారు. గద్వాల ఎమ్మెల్యే డికె అరుణ సమక్షంలో నియోజకవర్గంలోని పాతపాలెం, పూజారి తాండ గ్రామాల ప్రజలు కాంగ్రెస్ కండవా కప్పుకుని పార్టీలో చేరారు.
ఈ కార్యక్రమంలో డికె అరుణ మాట్లాడుతూ టిఆర్ఎస్ ప్రభుత్వ పాలనను చూసి ప్రజలు విసిగిపోయారన్నారు. బీద ప్రజలకు ఊర్లో గానీ గ్రామాల్లో గానీ డబుల్ బెడ్రూం లు ఇవ్వడం లేదన్నారు. ఇంటింటికి ఉద్యోగం ఇస్తామని చెప్పి ప్రజలను మోసం చేసిన పార్టీ టిఆర్ఎస్ పార్టీ అన్నారు. దేశంలోనే తెలంగాణ రైతుల ఆత్మహత్యల విషయంలో మొదటి స్థానం లో ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే అవినీతి రెండో స్థానం లో ఉందని అన్నారు. ఇచ్చిన హామీలు ఏ ఒక్కటి నేర వెర్చడం లేదని అన్నారు.
పార్టీలో చేరిన పాతపాలెం గ్రామానికి చెందిన వారిలో యూత్ మండల ప్రెసిడెంట్ పాండు, రమేశ్ RMP డాక్టర్, ,శ్యామ్ సుందర్ రెడ్డి, రంగన్న,బలగేరి అంజనేయూలు, గుండప్ప,ఈధప్ప,హన్మంత్, గోపి, తదితరులు ఉన్నారు.
అలాగే పూజారి తాండ నుంచి ఈరన్ననాయక్, మాన్య నాయక్, దీపాల నాయక్, శంకర్ నాయక్, పెద్ద వెంకటనాయక్, వీరేష్ నాయక్, శివ నాయక్, తదితరులు డికె అరుణ సమక్షంలో పార్టీలో చేరారు.
ఈ కార్యక్రమంలో టీపీసీసీ కార్యవర్గ సభ్యుడు గడ్డం క్రిష్ణ రెడ్డి, జిల్లా అధ్యక్షులు పటేల్ ప్రభాకర్ రెడ్డి, మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ నందిన్నే ప్రకాష్ రావు, మిర్జా పురం రామచంద్ర రెడ్డి,మిర్జా పురం వెంకటేశ్వర రెడ్డి, కాంగ్రెస్ సీనియర్ నాయకులు హన్మంత రాయ, ఎర్ర భిమ్ రెడ్డి, కర్ర రెడ్డి, హన్మి రెడ్డి, విష్ణు, మహాదేవ్, తెలుగు కేశవ్ ఉన్నారు.