ఉత్తరాంధ్రలో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ టెన్సన్ పడుతున్నారు. ఆ టెన్షన్ కు కారణం ఎవరో కాదు అభిమాన నటుడు, అభిమాన నాయకుడైన పవన్ కళ్యాణే. ఆయన కారణంగానే ఫ్యాన్స్ టెన్షన్ పడుతుండడం ఉత్తరాంధ్ర అంతటా చర్చనీయాంశమైంది. వివరాలు చదవండి.
ఉత్తరాంధ్రలో జనసేన ప్రజా పోరాట యాత్రపై కార్యకర్తల్లో అయోమయం నెలకొంది. శ్రీకాకుళం జిల్లాలో షెడ్యూల్ లేకుండా జనసేన అధినేత పవన్‌కళ్యాణ్ యాత్ర సాగుతోంది. చివరి క్షణంలో బస్సుయాత్రకు బదులు సొంత కారులో పవన్ యాత్ర చేస్తున్నారు జనసేనాని. దీంతో పవన్ అభిమానులు అయోమయానికి గురవుతున్నారు.
జిల్లాలో ఎన్ని రోజులు యాత్ర చేస్తారనే విషయంపై స్పష్టత లేదు. కార్యక్రమాలు వివరాలు తెలియకపోవడంతో అభిమానులు ఆందోళనలో పడ్డారు. జిల్లాలో పవన్ కళ్యాణ్ కు వేలాది మంది ఫ్యాన్స్ ఉన్నారు. వారంతా పవన్ యాత్రలో పాలుపంచుకోవాలన్న ఆరాటంతో ఉన్నారు. అయితే వారికి పక్కా సమాచారం లేకపోవడంతో యాత్రలో పాల్గొంటామా లేదా అన్న ఆందోళనలో ఉన్నారు. ఎక్కడ పాల్గొనాలన్న క్లారిటీకి రాలేకపోతున్నారట.
పవన్ ఆదివారం నుంచి ఉత్తరాంధ్రలో బస్సుయాత్ర ప్రారంభించారు. ముందుగా కవిటి మండలం, కాపాసుకుద్దిలో గంగ పూజ నిర్వహించారు. దీంతో అక్కడ మత్స్యకార మహిళలు పవన్‌కు ఘనస్వాగతం పలికారు. ఈ యాత్ర శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం నుంచి ఈ యాత్ర మొదలవుతుంది. జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో బస్సుయాత్ర సాగుతుంది. రోజుకు రెండు నియోజకవర్గాల్లో పవన్ పర్యటించేలా జనసేన రూట్ మ్యాప్ సిద్ధి చేసింది.
కానీ షెడ్యూల్ ప్రకారం కాకుండా యాత్ర సాగడం అభిమానుల్లో గందరగోళం నింపిందన్న ప్రచారం ఉంది. మరి దీనిపై జనసేనాని క్లారిటీ ఎప్పుడిస్తారో మరి ? తక్షణమే యాత్ర షెడ్యూల్ ఇచ్చి అభిమానుల ఆందోళనకు పులిస్టాప్ పెట్టాలని ఫ్యాన్స్ కోరుతున్నారు.