కర్నాకటలో రాజ్యంగం గెలిచిందని ప్రజాస్వామ్యం బతికి బట్టకట్టిందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చంకలెగురేసుకున్నారు. నిన్న ఆయన ఒక సుదీర్ఘోపన్యాసం చేశారు. మోదీ అటలు పాటల సాగలేదని, ఎమ్మెల్యేలని ఒట్టుమొత్తంగా కొనుగోలు చేసేందుకు మోదీ, అమిత్ షా, యడ్యూరప్ప, గాలిజనార్దన్ రెడ్డి చేసిన అవినీతి ప్రయత్నాలు ఫలించలేదని ఆయన హర్షం వ్యక్తం చేశారు. ఈ వ్యవహారంలో కోర్టులు కూడా సహకరించాయని ఆయన అన్నారు. ఇలాంటి తప్పులు జరుగుతున్నపుడు ప్రజలు ప్రశ్నించాలన్నారు. ఎదుర్కోవాలన్నారు. కర్నాటకలో బిజెపి పారిపోయిందన్న ఉత్సాహంలో ఆయన ఇంకా ఏమేమో ఉపన్యసించారు. ఈ వీడియో చూడండి.
అంతాబాగుంది ఎమ్మెల్యేల కొనుగోళ్లు అని కర్నాటక మీద ఆందోళన వ్యక్తం చేసిన చంద్రబాబు ఆంధ్రలో సాగిన ఎమ్మెల్యేల గురించి ఏమ్మాట్లడతారు. ఆంధ్రకి, కర్నాటకకి ఉండేది ఒక రాజ్యాంగం కాదా. కర్నాటకలో ఎమ్మెల్యేలను బిజెపి ముఖ్యమంత్రి యడ్యూరప్ప కొనాలనుకోవడం తప్పయితే, ఆంధ్రలోె ముఖ్యమంత్రి చంద్రబాబు కొనుగోలు చేసిన ఎమ్మెల్యేల సంగతేమిటి? ఇాలా కొనుగోలు చేసిన ఎమ్మెల్యేలలో కొంతమంది మంత్రులుకూడా అయ్యారు. దాని గురించి కూడ చంద్రబాబు ఆలోచించాలి. ఇక్కడ రాజ్యాంగ పరిరక్షణ అవసరం లేదా. ఇలాంటి విషయాల మీద మాట్లాడే నైతిక హక్కు చంద్రబాబుకు ఉందా?
ఇదే ప్రశ్న వైసిపి నేత జగన్మోహన్ రెడ్డి వేస్తున్నారు. ఇదిగో జగన్ ఏమంటున్నారో చూడండి
— YS Jagan Mohan Reddy (@ysjagan) May 19, 2018