ఆంధ్రలో చాలా కాలంగా కాంగ్రెసోళ్లు ఏదో ఒక దానికి బాగా పోరాడుతున్నారు. దాంట్లో అనుమానం లేదు. ప్రత్యేక హోదా కోసం పోరాడారు. రాహుల్ గాంధీ స్వయంగా అనంతపురం జిల్లా వచ్చి యాత్ర చేశారు. ఆంధ్రోళ్ల నోట్ల మట్టిగొట్టిన ప్రధాని మోదీకి మట్టి తిరిగి పంపించారుర. చంద్రబాబు విధానాలకు వ్యతిరేకంగా ధర్నాలు చేశారు. బంద్ లు పెట్టారు. మోదీకి వ్యతిరేకంగా ఆందోళన చేశారు. అయితే, వాళ్లు పండగచేసుకున్నదొక్కసారే, ఆ మధ్య రాహుల్ గాంధీ పార్టీ అధ్యక్షుడయ్యాక. అదేదో ఇంటి వ్యవహారం. అయితే, మొదటిసారిగా కాంగ్రెస్ వాళ్లు రోడ్డెక్కి ఇపుడు పండగ చేసుకుంటున్నారు. కర్నాటకలో ప్రధాని మోదీ, బిజెపి అధ్యక్షుడు అమిత్ షా, గనులఘరానా గాలి జనార్ధన్ రెడ్డిల వ్యవూాలు, డబ్బు సంచులు కాదని ఎమ్మెల్యేలను కాపాడుకున్నారు. మోదీకి బెంగుళూరు రాకుండా చేశారు. యడ్యూరప్పను మూడు రోజుల ముఖ్యమంత్రిని చేశారు. మోదీ మీద ఇంత దెబ్బతీసినందుకు ఆంధ్ర కాంగ్రెస్ వాళ్ల విజయవాడలో సంబరాలు చేసుకున్నారు.
Congress party takes out a march in Vijayawada to celebrate the victory of democracy in Karnataka.#CongressDefeatsBJP pic.twitter.com/fQqdFkL9lD
— INC Andhra Pradesh (@INC_Andhra) May 20, 2018