అనగనగా ఒక వూరు ఆ వూరు పేరు దౌలత్ పూర్. ఉత్తర ప్రదేశ్ లో కుగ్రామం. రాజధాని లక్నోకి 70 కిమీ దూరంలో ఉంటుంది. 10 సంవత్సరాల కిందట అంటే 2008లో ఈ వూరు ఉన్నట్లుండి అంతర్జాతీయ వార్త అయింది. ఎందుకో తెలుసా ఆవూరికి గొప్పగొప్ప వాళ్లంతా వచ్చారు. భారదేశపు మెగాస్టార్ అమితాబ్ బచ్ఛన్, ఆయన భార్య జయాబచ్ఛన్, కుమారుడు అభిషేక్ బచ్ఛన్ తో పాటు కోడలుఐశ్వర్యరాయ్ ఆవూర్లో ప్రత్యక్ష మయ్యారు. అతేకాదు ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి ములాయాం సింగ్ యాదవ్, ఆంధ్ర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, లోక్ సభ సభ్యరాలు జయప్రద , కాశ్మర్ మాజీ ముఖ్య మంత్రి ఫారూక్ అబ్దుల్లా, హర్యానా మాజీ ముఖ్యమంత్రి ఓంప్రకాశ్ చౌతాలా, ఎస్ పి నేత అమర్ సింగ్ … ఇలా ఎందరో ఆ మూరమూల గ్రామానికి వచ్చారు. దీనితో వూరు పేరు ప్రపంచమంతా మారుమ్రోగింది. వారంతా ఎందుకొచ్చారో తెలుసా?
ఆవూరు ప్రజలకు, ఆ ప్రాంతానికి సేవ చేయాలని అమితాబ్ కుటుంబానికి కోరికపుట్టింది. అంతే, ఆవూర్లో శ్రీమతి ఐశ్వర్యరాయ్ బచ్ఛన్ డిగ్రీ కాలేజీ కట్టాలని నిర్ణయించారు. ఈ సెలెబ్రిటీలంతా కాలేజీ శంకుస్థాపన కార్యక్రమానికి వచ్చారు. శుంకుస్థాపన ఘనంగా జరిగింది. దాదాపు రెండు వేల మంది ప్రజలు హాజరయ్యారు. అక్కడ ప్రసంగిస్తూ వక్తలంతా బాలికల విద్య గురించి చాలా గొప్ప విషయాలు చెప్పారు. తర్వాత వెళ్లిపోయారు. అంతే, వూరిని ,కట్టాలనుకున్న ఢిగ్రీకాలేజీని అంతా మర్చిపోయారు. గత పదేళ్లలో అమితాబ్ కుటంబం గాని, కార్యక్రమానికి వచ్చి వితరణ మీద అమితాబ్ ప్రశంసించిన వాళ్లు ఏమీ చేయలేదు. ఇప్పటిదాకా కాలేజీకి ఒక్క ఇటుకపడ లేదు. చివరకు అపుడు పాతిన శంకుస్థాపన స్తూపం గ్రామపంచాయతీ ఆఫీసులో ఒక మూలన పడింది. ఇక వీళ్ల మీద ఆశలువదులుకిన కాలేజీని తామే కట్టుకోవాలని గ్రామస్థులంతా నడుంబిగించారు. క్రౌడ్ ఫండింగ్ పద్ధతిలోరు.60లక్షలు జమచేశారు. 12 తరగతి గదులున్న ఒక కాలేజీ భవనాన్ని కట్టుకున్నారు.కాలేజీకోసం వూర్లో ఉన్న టీచరొకరు 10 వేల చదరపు మీటర్ల భూమిని అందించారు. కాలేజీ తయారయింది. దౌలతాపూర్ కాలేజీ అని పేరు పెట్టుకున్నారు.
జరిగిందేమిటంటే… ఈ కాలేజీ కట్టే పనిని బచ్ఛన్ కుటుంబం నిషితా ఫౌండేషన్ కు అప్పచెప్పారు. ఈ ఫౌండేషన్ ఎవరిదనుకున్నారు. అపుడు సమాజ్ వాది పార్టీ ఎంపిగా నటి జయప్రదది. ఈ సంస్థ ఆమరుసటి సంవత్సరమే మూత పడింది. తర్వాత కాలేజీ కట్టే బాధ్యతని అమితాబ్ బచ్ఛన్ సేవా సంస్థాన్ (ఎబిఎస్ ఎస్ ) తీసుకుంది. 2012లో కాలేజీ పేరును ఐశ్వర్యారాయ్ బచ్ఛన్ గర్ల్స్ ఇంటర్ కాలేజీ గా మార్చారు. కాలేజీ కట్టడానికి అపుడొకసారి రు.5 లక్షల చెక్కు ఇచ్చారు. అంతే, అది ఫస్టు చెక్ లాస్ట చెక్ అని ఎబిఎస్ ఎస్ బాధ్యుడు అమిత్ సింగ్ ( వూరి ప్రధాన్ ) చెబుతున్నారు.
(బ్యానర్ ఫోటో ది హిందూ సౌజన్యం)