స్టివ్స్ కార్నర్ పతాకంపై ఫోన్స్ స్టీఫెన్ నిర్మాతగా వి .సి.వడివుడయాన్ దర్శకత్వంలో సన్నీలియోన్ తెలుగు ప్రేక్షకులకు ముందుకొస్తున్నది. ఈ భారీ చారిత్మాత్మక చిత్రం పేరు వీరమహాదేవి .
100 కోట్ల భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ చిత్రం ఒకేసారి 5 భాషల్లో షూటింగ్ జరుపుకొంటుంది . సన్నీలియోన్ తెలుగులో మొదటిసారి నటిస్తున్నందున ఆమె తెలుగు నేర్చుకొంటున్నారు . నాజర్ మరియు తమిళ్ ,మలయాళం , కన్నడ మరియు హిందీ భాషలలోని ప్రముఖ నటులు ఇందులో నటిస్తున్నారు . యుద్ధ సన్నివేశాలకొరకు సుమారు 1000 గుర్రాలు మరియు ఏనుగులు ఉన్నందున నటీనటులకు గుర్రపుస్వారిలో శిక్షణ ఇస్తున్నారు .
సన్నీలియోన్ దుస్తులు దక్షిణభారత సంప్రదాయంలో ఉంటాయి .వీటిని ముంబై తో తయారు చేస్తున్నారు . రామోజీఫిలింసిటీలో భారీ సెట్ వేయుటకు సన్నాహాలు చేస్తున్నారు . కేరళలోని అడవులలో ప్రభుత్వ ప్రత్యేక అనుమతితో భారీ ఫైటింగ్ సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు . గ్రాఫిక్స్ ఎక్కువగా ఉన్నందున కెనడా లోని కంపెనీ మరియు ఇక్కడ ఒక ముఖ్య కంపెనీ కలసి పనిచేస్తున్నాయి . Lord of the Rings మరియు Gods of the Egypt చిత్రాలకు పనిచేసినవారు ఈ చిత్రానికి గ్రాఫిక్స్ పర్యవేక్షకులుగా పనిచేస్తున్నారు .గ్రాఫిక్స్ కోసం సుమారుగా 40 కోట్లు ఖర్చుపెడుతున్నారు . ఈ చిత్రం కోసం సన్నీలియోన్ 150 రోజులు కేటాయించారు. భారీఅంచనాలున్న ఈ చిత్రం ఫస్టులుక్ ప్రపంచవ్యాప్తంగా ఈ రోజు విడుదల చేస్తున్నారు.