గాలి జనార్దన్ రెడ్డి పేరు కన్నడ రాజకీయాల్లోనే కాదు యావత్ దేశమంతా మరోసారి మారుమోగిపోతున్నది. ఎందుకంటే ఆయన యడ్యూరప్ప సర్కారును నిలబెట్టేందుకు రంగంలోకి దిగి బేరసారాలు మొదలు పెట్టారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన రాయచూర్ రూరల్ ఎమ్మెల్యే బసన్న గౌడ కు గాలి జనార్దన్ రెడ్డి గాలమేశాడు. తన మాట విని యడ్యూరప్ప సర్కారుకు మద్దతిస్తే నీ లైఫ్ సెటిల్ చేస్తానంటూ ఆఫర్ చేశాడు.
గాలి జనార్దన్ రెడ్డి రాయచూరు రూరల్ ఎమ్మెల్యే బసన్నగౌడ తో జరిపిన ఫోన్ సంభాషణను కాంగ్రెస్ నేత ఉగ్రప్ప మీడియాకు విడుదల చేశారు. ఈ ఆడియో టేపులు ఇప్పుడు దేశమంతా దుమారం రేపుతున్నాయి. అవినీతి రాజాగా పేరు పొందిన గాలి జనార్దన్ రెడ్డి మళ్లీ తన కొనుగోలు మార్కు మొదలు పెట్టారని జనాలు ఆశ్చర్యపోతున్నారు.
ఫోన్లో బసన్న గౌడతో మాట్లాడే సమయంలో ఇప్పటికే ఇద్దరు ఎమ్మెల్యేలు రాజన్న గౌడ, శివన్న గౌడ్ ల లైఫ్ సెటిల్ చేశానని కూడా గాలి ఆశ చూపారు. అయితే తనకు రాజకీయాల్లో విశ్వసనీయత ముఖ్యమని చెప్పిన కాంగ్రెస్ ఎమ్మెల్యే బసన్న గౌడ ఖరాఖండీగా చెప్పేశారు. కాంగ్రెస్ పార్టీతోనే ఉంటానని తేల్చి చెప్పారు. గాలి ఆడియో రికార్డు పైన ఉంది. కన్నడ భాషలో ఉన్న ఆడియోను మీరూ ఒకసారి వినండి.