గాలి జనార్దన్ రెడ్డి పేరు వినగానే మైనింగ్ మాఫియా కింగ్ అని చెబుతారు. మైనింగ్ మాఫియాలో వేల కోట్లు సంపాదించి తుదకు కేసుల్లో ఇరక్కున్నారు. ఊచలు లెక్కబెట్టారు. జైలు నుంచి వచ్చిన తర్వాత కూడా గాలి జనార్దన్ రెడ్డి తన బుద్ధులు మాత్రం మార్చుకోలేదు. తాజాగా తన అవినీతి డబ్బుతో ఎమ్మెల్యేల కొనుగోలు కోసం నడుం బిగించారు. రంగంలోకి దిగారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన రాయచూర్ రూరల్ ఎమ్మెల్యే బసన్న గౌడ కు గాలి జనార్దన్ రెడ్డి గాలమేశాడు. తన మాట విని బిజెపిలోకి ఫిరాయిస్తే నీ లైఫ్ సెటిల్ చేస్తానంటూ ఆఫర్ చేశాడు. యడ్యూరప్పకు మద్దతిచ్చి నీ లైఫ్ సెటిల్ చేసేసుకో అంటూ ఆఫర్ చేశాడు.
గాలి జనార్దన్ రెడ్డి రాయచూరు రూరల్ ఎమ్మెల్యే బసన్నగౌడ తో జరిపిన ఫోన్ సంభాషణను కాంగ్రెస్ నేత ఉగ్రప్ప మీడియాకు విడుదల చేశారు. ఈ ఆడియో టేపులు ఇప్పుడు దేశమంతా దుమారం రేపుతున్నాయి. అవినీతి రాజాగా పేరు పొందిన గాలి జనార్దన్ రెడ్డి మళ్లీ తన కొనుగోలు మార్కు మొదలు పెట్టారని జనాలు ఆశ్చర్యపోతున్నారు. ఫోన్లో బసన్న గౌడతో మాట్లాడే సమయంలో ఇప్పటికే ఇద్దరు ఎమ్మెల్యేలు రాజన్న గౌడ, శివన్న గౌడ్ ల లైఫ్ సెటిల్ చేశానని కూడా గాలి ఆశ చూపారు. అయితే తనకు రాజకీయాల్లో విశ్వసనీయత ముఖ్యమని చెప్పిన కాంగ్రెస్ ఎమ్మెల్యే బసన్న గౌడ ఖరాఖండీగా చెప్పేశారు. గాలి ఆఫర్ ను ఆయన సున్నితంగా తిరస్కరించారు. మొత్తానికి గాలి ఆడియో ఇప్పుడు దుమారం రేపుతోంది.
గాలి జరిపిన ఆడియో సంభాషణ కింద ఉంది చూడండి.