విశాఖ: మే 20 నుంచి 45 రోజుల పాటు ఉద్యమ కార్యాచరణను జనసేన పవన్ విశాఖలో ప్రకటించారు.రాష్ట్ర విభజనతో నష్ట పోయిన రాష్టానికి నికి న్యాయం చేయాలని కేంద్రం పై ఒత్తిడి తెచ్చేందుకు యాత్రను చేపడుతున్నట్టు విశాఖలో పవన్ ప్రకటించారు. ఇది ఉత్తరాంధ్రలో 45 రోజుల పాటు కొనసాతున్నట్లు తెలిపారు. శ్రీకాకుళం జిల్లాలోని ఇచ్ఛాపురం తీర ప్రాంతంలో గంగపూజతో యాత్ర మొదలవుతుంది.ఇదే విధంగ జైఆంధ్ర ఉద్యమ అమరవీరులకు నివాళులర్పిస్తారు.
ఈ రోజు ఆయన విశాఖ అంబేద్కర్ భవన్ లో పార్టీ నేతలో మాట్లాడుతూ కర్నాటక ఎన్నికల మీద ఆసక్తి కరమయిన వ్యాఖ్యలు చేశారు. ఆయన అన్నమాటలివి:
“కర్నాటకలో బీజేపీ ఎన్ని సీట్లు వచ్చినా ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని ఎన్నికలకు ముందే నాకు చెప్పారు. అన్ని పార్టీలూ హార్స్ ట్రేడింగ్ కు పాల్పడుతుంటే బీజేపీని ప్రశ్నించే నైతిక హక్కు ఎవరికీ లేదు,’’
175 నియోజకవర్గాల్లో యాత్ర కొనసాగుతుందని ప్రతి జిల్లాలో యాత్ర తర్వాత లక్ష మందితో నిరసన కవాతులు నిర్వహిస్తారు. ప్రతి నియోజకవర్గంలో రెండు రోజుల పాటు యాత్ర కొనసాగుతుంది. 13 జిల్లాలో జై ఆంధ్ర ఉద్యమం అమరవీరులకు స్తూపాలు నిర్మించాలని కూడా ఆయన చెప్పారు.
‘ఇది ప్రజాయాత్ర. రోడ్ షోలు, పాదయాత్రలు, అన్నీ ఉంటాయి. ఇది కేవలం బస్సు యాత్ర కాదు. రాజకీయ జవాబుదారీ తనం మీద ప్రజల్లో అవగాహన పెంచటమే మా పార్టీ లక్ష్యం,’ అని ఆయన అన్నారు.
విశాఖలో మరో రెండు రోజులుంటారు.