కర్ణాటక గవర్నర్ వ్యవహరించిన తీరుపై ఆంధ్రాలో రాజకీయ పార్టీలు భగ్గుమన్నాయి. పలు ప్రజా సంఘాలు, పార్టీల ఆధ్వర్యంలో ఏకంగా గవర్నర్ శవయాత్ర జరిపారు. వివరాలిలా ఉన్నాయి.
ఆంధ్రాలో కర్ణాటక గవర్నర్ శవయాత్ర (వీడియో)
కర్ణాటక గవర్నర్ వ్యవహరించిన తీరుపై ఆంధ్రాలో రాజకీయ పార్టీలు భగ్గుమన్నాయి. పలు ప్రజా సంఘాలు, పార్టీల ఆధ్వర్యంలో ఏకంగా గవర్నర్ శవయాత్ర జరిపారు. వివరాలిలా ఉన్నాయి.
గుంటూరు జిల్లా గురజాలలో గవర్నర్లు రాజ్యాంగవిరుద్ధంగా వ్యవహరిస్తున్నారని గవర్నర్ల వ్యవస్థ రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఆందోళన జరిపారు. 123 స్వచ్ఛ పాలిటిక్స్ వ్యవస్థాపక అధ్యక్షుడు బడేజాని, సిపిఐ, సిపిఎం అఖిలపక్షం ఆధ్వర్యంలో గురజాల పట్టణంలో కర్ణాటక గవర్నర్ శవయాత్ర కార్యక్రమం జరిపారు. ఈ శవయాత్ర కారంపూడి రోడ్డు నుండి మెయిన్ రోడ్డు మీదుగా బ్రహ్మనాయుడి విగ్రహం వద్ద యాత్రగా సాగి అనంతరం గవర్నర్ దిష్టిబొమ్మను గుంటూరు మాచర్ల రహదారిపై దగ్ధం చేశారు. ఈ సందర్భంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. వీడియో పైన ఉంది. చూడండి.