హైదరాబాద్ నగరంలో వాతావరణం రకరకాలుగా మారిపోతున్నది. క్షణానికో తీరుగా వెదర్ మారిపోవడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. మల మల ఎండలు మండిన క్షణాల్లో జోరుగా వాన కురుస్తున్నది. మధ్యాహ్నం ఎండ దంచి కొట్టింది. వెంటనే వాతావరణంలో అనూహ్య మార్పులు వచ్చి ఈదురుగాలులు, భీకర వర్షం కురిసింది. ఆకాశం దట్టమైన మేఘాలతో కమ్మేసింది.
గురువారం నాడు నిమిషాల్లోనే హైదరాబాద్ వాతావరణం మారిపోయింది. గాలి దుమారంతో బెంబేలెత్తించింది. ఆ వెంటనే భారీ వర్షం. ఊహించని విధంగా వాతావరణంలో మార్పులతో ప్రజలు కూడా భయాందోళనకు గురయ్యారు. నాచారం, మల్లాపూర్, సికింద్రాబాద్, బేగంటపేట, పంజాగుట్ట, అమీర్ పేట్, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, కూకట్ పల్లి, హైటెక్ సిటీ, కోఠి, బర్కత్ పుర, నారాయణగూడ, ఉప్పల్, రామాంతాపూర్ ప్రాంతాల్లో భారీ వర్షం పడింది.
చార్మినార్, దిల్ సుఖ్ నగర్, ఎల్బీనగర్, చైతన్యపురి, వనస్థలిపురం, హయత్ నగర్ ప్రాంతాల్లోనూ ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం పడుతుంది. గాలి దుమారానికి చాలా చోట్ల హోర్డింగ్స్ ఎగిరిపడ్డాయి. విద్యుత్ వైర్లు తెగిపోవటంతో కొన్ని చోట్ల విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. భారీ వర్షానికి చాలా చోట్ల రోడ్లపై నీళ్లు నిలిచాయి. ఒక్కసారిగా మారిపోయిన వాతావరణం.. అంతలోనే గాలి దుమారం, ఆ వెంటనే భారీ వర్షంతో హైదరాబాదీలు షాక్ అయ్యారు. వర్షం జోరుగా కురుస్తున్న సమయంలో తీసిన వీడియోలు పైన ఉన్నాయి చూడండి.