కర్నాటకలో వచ్చిన ఎన్నికల ఫలితాలు తీరు జెడిఎస్ పెద్దాయన దేవెగౌడ కుటుంబంలో చిచ్చు పెట్టబోతున్నాయని వదంతులు వినబడుతున్నాయి. కర్నాటకలో ప్రభుత్వం ఏర్పాటుచేయడంలో అనుకున్నట్లే జెడిఎస్ కీలకప్రాత వహిస్తున్నది. దీనితో జెడిఎస్ ఎటువోతున్నదనే ప్రశ్న వస్తున్నది. అసలు ఈ పరిస్థితితోనే దేవెగౌడకు తలనొప్పతెస్తున్నదని చెబుతున్నారు.
దేవెగౌడ్ కాంగ్రెస్ కు మద్దతు ప్రకటించి, ఒక కుమారుడు కుమారస్వామిని మఖ్య మంత్రిని చేయాలనుకుంటే, బిజెపి దీనికి విరుగుడు కనిపెట్టిందని చెబుతున్నారు. తండ్రి కాంగ్రెస్ వైపు మళ్లితే, చిన్న కుమారుడు రేవన్ణ బిజెపి వైపు వస్తాడని, దీనితో కుటుంబం నిలువునా చీలుతుందని వార్తలు వెలువడుతున్నాయి. బిజెపి రేవణ్ణతో మంతనాలు కూడా మొదలుపెటట్టిందని చెబుతున్నారు. దీనితో శరవేగంగా కర్ణాటక రాజకీయం మారుతూ ఉంది.
కుమారస్వామి కాంగ్రెస్ తో కలిస్తే దేవెగౌడ పెద్ద కొడుకు రెవణ్ణా తన అనుచరులు 10 నుంచి 15 మంది ఎమ్మెల్యేలతో బీజేపీ కి మద్దతు ఇచ్చే అవకాశం ఉందని బిజెపి వర్గాలు ప్రచారం మొదలుపెట్టాయి.బీజేపీ రెవణ్ణ టచ్ లోె ఉన్నారని కూడా బిజెపి నేతలు చెప్పుకుంటున్నారు. ఇది నిజమా లేక బిజెపి ఆడుతున్న నాటకమా తెలియదు. మరి దేవెగౌడ ఏమంటారో చూడాలి.