బెంగుళూరులో టెన్షన్ : జెడి(ఎస్) ను చీల్చేందుకు బిజెపి స్కెచ్ ?

ఇపుడు దృష్టంతా బెంగుళూరు రాజ్‌భవన్‌ మీదకు మళ్లింది.  ఎన్నికల ఫలితాల్లో ఏపార్టీకి మెజారిటీ రాకపోవడం వల్ల  ప్రభుత్వ ఏర్పాటుకు సంబంధించి గవర్నర్‌ వాజుభాయ్‌ రుడాభాయ్‌ వాలా ఏ నిర్ణయం తీసుకుంటారనేది చర్చనీయాంశమయింది. అందుకే అంతా ఇపుడు రాజ్ భవన్ వైపు చూస్తున్నారు.  ఒక వైపు కాంగ్రెస్  జెడిఎస్ కు మద్దతు ప్రకటిచింది. ఈ లేఖతో తనను ప్రభుత్వం ఏర్పాటుచేసేందుకు  ఆహ్వానించాలని జెడిఎస్ నాయకుడు , మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి గవర్నర్ కు లేఖ రాశారు. సాయంకాలం లోపు తననకు అపాయంట్ మెంట్ కావాలని కుమారస్వామి కోరారు. ఇలాగే బిజెపి కూడా అపాయంట్ మెంటు కోరింది.

అంతకు ముందు కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ ఫోన్ చేసి మద్ధతు కోరారు.
జేడీఎస్ కి ముఖ్యమంత్రి పదవి ఇచ్చేందుకు  సోనియా గాంధీ అంగీకరించారు. కాంగ్రెస్కు మద్దతునీయడం గౌడ  రెండో కొడుకురేవణ్ణకునచ్చడం లేదని చెబుతున్నారు.
అందుకే ఆయన తన దారి బిజెపి వైపు చూసుకుంటున్నారని గులాబి దండు గట్టిగా చెబుతున్నది.

ఈ లోపు జెడిఎస్ ను చీల్చేందుకు బిజెపి ప్రయత్నాలు మొదలుపెట్టిందని వార్తలు వెలువడుతున్నాయి. మేం ఈ మధ్యాహ్నమే ఈ విషయం వెల్లడించాం.  దానికి తగ్గట్టుగా దేవేగౌడ్ పెద్ద కొడుకు రేవణ్ణకు ఉప ముఖ్యమంత్రి పదవ ఆశ చూపి పది మంది ఎమ్మెల్యేలను తీసుకుని వచ్చే లా బిజెపి పావులను కదుపుతూ ఉందని అంతా చెబుతున్నారు. ఈ కార్యం పూర్తి చేసేందుకు బిజెపి అధ్యక్షుడు అమిత్ షా బెంగుళూరు వస్తున్నారు.

ఎక్కువ మంది ఎమ్మెల్యేలను గెల్చుకున్నందున ప్రభుత్వం ఏర్పాటుచేసే అవకాశం తమకే ఇవ్వాలని బిజెజపి ముఖ్యమంత్రి అభ్యర్థి యడ్యూరప్ప డిమాండ్‌ చేశారు. ఎక్కువ మంది సభ్యుల మద్దతు తనకే ఉన్నందున జెడిఎస్ ను ఆహ్వానించాలని  కాంగ్రెస్‌-జేడీయూ నేతలు డిమాండ్ చేస్తున్నారు.

దీనితో రాజకీయం ఉద్రిక్త మవుతూ ఉంది. ఇది వివాదానికి దారి తీసే ప్రమాదం ఉన్నందున రాజ్‌భవన్‌ భద్రతను కట్టుదిట్టం చేశారు.  ఈ లోపు ముఖ్యమంత్రి సిద్దరామయ్య రాజీనామా చేశారు.

Read this also

https://trendingtelugunews.com/karnataka-results-likely-to-cause-split-in-deve-gowda-family/

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *