కమ్యూనిస్టు పార్టీలకు తప్ప ఇతర పార్టీలకు జండా పాటలు, పార్టీ పాటలు లేవు. వుండవు. ఒక కమ్యూనిస్టులే జండా పాటలు పాడతారు. ఎర్రజండెరజెండెనీయలో..’ అని కమ్యూనిస్టులు పాడేవారు. ఎత్తినాం విరసం జండా అని విప్లవరచయితలుపాడే వారు. ఇలా కమ్యూనిస్టులందరికి జండా పాటలుండేవి. షే గువేరాస్ఫూర్తి, తరిమెల నాగిరెడ్డి స్ఫూర్తిగా చెప్పుకునే జనసేన అధిపతి కూడ ఇపుడు కమ్యూనిస్టుల తరహాలో జండా పాట విడుదల చేశారు. జండాలో ఎర్ర రంగు కూడా దట్టంగా ఉంది. ఇంతగా ఎరుపు పులుముకున్న పార్టీ కూడా జనసేన యేనేమో. ఈ పాట విడదల పోస్టర్ కూడా ఎర్రగానే ఉంటుంది. ఐడియాలాజికల్ గా ఆయన ఎటువెళతాడో తెలియదు. ఇప్పటికయితే ఆయనకు కొద్దికాషాయం అంటుకుంది. దానిని చెరిపేసుకుని నిజమయిన, స్వతంత్రమయిన పార్టీఉంటాడో లేక ఏదో ఒక పార్టీకి అనుబంధంగా కొనసాగుతాడో చూడాలి.