చంద్రబాబు కర్నాటక రాజకీయ నిర్ణయం బిజెపి కి లాభిస్తుందా ?

కర్నాటకలో తెలుగువారు వారు కూడా రాజకీయంగా ఏదో ఒక పార్టీకి అనుకూలంగానో ప్రతికూలంగానో ఉన్నారు. కర్నాటకలో స్థిరపడిన  తెలుగువారు ప్రధానంగా రాయలసీమ, నెల్లూరు, తెలంగాణ నుంచి ఉన్నారు. ఈ ప్రాంతాలు సహజంగా కాంగ్రస్ కు అనుకూలంగా ఉన్నవే. సామాజిక తరగతుల వారిగా చూసినా వారు ఇప్పటి వరకు కాంగ్రస్ కు అనుకూలంగానే ఉన్నారు. కొద్దిశాతం మాత్రమే TDP కి అనుకూలంగా ఉంటారు. వారు అదే సామాజిక కారణంతో  BJPకి ఇప్పటి వరకు అనుకూలంగా ఉన్నారు. విభజన, వై యస్ మరణం తర్వాత  కాంగ్రెస్ కు సానుకూలంగా ఉన్న సామాజిక తరగతులు వారికి వ్యతిరేకంగా మారకపోయినా వారిపై  YSRCP ప్రబావం ఉంటుంది. ఎగ్జిట్ పోల్స్ ఫలితాల తర్వాత ఈ నేపధ్యంలో టిడిపి అధినేత చంద్రబాబు నాయుడుఇచ్చిన రాజకీయ నినాదం ఎంతో కొంత BJPకి లాభిస్తుందేమో అన్న అనుమానం కలుగుతుంది. కారణం ఇప్పటివరకు  BJP కి వైపు ఉన్న TDP అనుకూల ప్రజలు కాంగ్రస్ వైపు మల్లితే బాబు నిర్ణయం కారణంగా  కాంగ్రస్ కు అనుకూలంగా ఉన్న ప్రజలు  BJP వైపు కొంత మొగ్గు చూపినారు అన్న ప్రచారం జరుగుతుంది. కర్నాటకలో స్దిరపడింది సీమ, తెలంగాణ ప్రాంతం నుంచి కావడం వారిలో ఎక్కువ మంది ఉపాధి కోసం వెళ్లిన సాధారణ ప్రజలు ఉన్నారు. వీరిపై ప్రాంతీయంగా చూసినా, సామాజిక తరగతుల వారిగా చూసినా కూడా  YSRCP ప్రబావం, అంతకు మించి TDP వ్యతిరేక ప్రభావం ఉంటుంది.  ఈ పరిణామమే  BJP కి అనుకూలంగా మారే అవకాశం ఉంది. తెలుగు వాళ్లమని ఎంత గొప్పగా చెప్పుకున్నా, చాలా దూరం అమెరికాకు వెళ్లినా   కులంపేరుతో రాజకీయంగా విడిపోయిన వారు తెలుగుప్రజలు. ఆంద్రప్రదేశ్ కు కూత వేటు దూరంలో ఉన్న కన్నడలో ఇక్కడి కుల వాసనలకు భిన్నంగా ఉంటారని భావించలేము. అందులోనూ కన్నడలో ఎక్కువగా స్థిరపడి ఉన్నది రాయలసీమ, తెలంగాణ నుంచి కావడం, చంద్రబాబు పిలుపును అందుకుని ముందుకు వెళ్లింది సర్కారు జిల్లాలకు చెందిన చెలసాని, అశోక్ బాబు లాంటి సీమ వ్యతిరేకులే. తెలంగాణ ఉద్యమంలో సైతం వ్యతిరేకంగా పని చేసినారు వారు. సామాజికంగా చూసినా వారు అక్కడ మైనారిటీ. సమాజంలో మంచి అభిప్రాయం ఉన్నవారు కూడా కాదు.

ఫోటో https://www.pollingbhoot.co.in నుంచి

తెలుగు వారిలో  BJP కి కొంత ప్రతికూల పరిస్థితులు  ఉన్నాయి. ఇప్పటివరకు తెలుగువారు కాంగ్రెస్ కు అనుకూలంగా ఉండటం, ఆంద్రప్రదేశ్ లో  BJP కి ప్రతికూల పరిస్థితులు ఉండటం వలన తెలుగు ప్రజలు నిర్ణయాత్మక పాత్ర పోషించే చోట ఎదురీదే పరిస్థితి వారిది. బాబు రాజకీయ నిర్ణయంతో TDP అనుకూల శ్రేణులు కాంగ్రస్ కు అనుకూలంగా ఓటు వేసినారు. బాబు అంతటితో ఆగిఉంటే సరిపోయేది   రాయలసీమ, తెలంగాణ సమాజంలో ఏ మాత్రం గౌరవంలేని, TDP అనుకూలం అని ముద్రవేసుకున్న అశోక్ బాబు, చెలసాని, శివాజీ లాంటి వారితో మాట్లాడించడం వలన వారి మీద ఉన్న కోపంతో ఇప్పటివరకు కాంగ్రస్ కు అనుకూలంగా ఉన్న ప్రజలు కొంత మేరకు  BJP వైపు మొగ్గు చూపినట్లుగా కనపడుతుంది. ఆ పరిణామం ఎంతో కొంత  BJPకి లాభం చేకూరనుంది అనడంలో సందేహం లేదు. జగన్  YSRCP స్దాపించిన తర్వాత కాంగ్రెస్ తో ఉన్న సామాజిక తరగతులు జగన్ వైపు వెళ్లినాయి. కానీ అదే సామాజిక తరగతి ప్రజలు తెలంగాణలో జగన్ రాజకీయంగా శ్రద్ధ పెట్టకపోవడం వలన వారు కాంగ్రస్ తోనే ఉన్నారు. అదే పరిస్దితి నేడు కర్నాటకలో కూడా ఉంది. బాబు తీసుకున్న రాజకీయ నిర్ణయం కారణంగా పరిస్థితిలో మార్పు వచ్చినట్లుగా కనిపిస్తున్నా అది ఓటింగ్ వరకు వెల్లిందా లేదా అన్నది మాత్రం 15 న వెల్లడి అయ్యే ఫలితాలు అందులోనూ తెలుగు వారు కీలకంగా ఉన్న నియోజిక వర్గాల ఫలితాలను పరిశీలించితే గాని ఒక నిర్ణయానికి రాలేము.

 

-యం. పురుషోత్తం రెడ్డి,రాయలసీమ మేధావుల పోరం. తిరుపతి

9490493436.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *