రాజకీయాల్లో ఒడిదుడుకులు ఎదురవుతున్నా, ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ మంత్రి అఖిలప్రియ జీవితంలోకి ఆనందపు ఘడియలు ప్రవేశిస్తున్నాయి.
అఖిల వివాహం చేసుకుంటునట్లు, నిశ్చితార్థం కూడా జరిగిపోయినట్లు వార్తలు వచ్చాయి. పోటోలు కూడా విడుదలయ్యాయి.
ఈ ఉదయం హైదరాబాదులోని ఆమె నివాసం లోనే నిశ్చితార్థం జరిగింది. ఈ కార్యక్రమానికి కేవలం మంత్రి కుటుంబ సన్నిహితులు మాత్రమే హాజరయ్యారు. ఈ కార్య క్రమం ఫోటోలు సోషల్ మీడియాలో యమవైరలయ్యాయి. అబ్బాయెవరో కాదు, మాజీ డిజిపి సాంబశిశరావు సమీప బంధువయిన బార్గవ్ రామ్ అని చెబుతున్నారు. అఖిల ప్రియకు ఇది రెండో వివాహం. మొదటి భర్త నుంచి ఆమె విడాకులు తీసుకున్నారు.