సోషల మీడియా ఒక్కటి చాలదు, రైవల్స్ లాగా ఎలెక్ట్రానిక్ మీడియా లేక పోతే వెనక్కు పడిపోతామని జనసేనాని పవన్ కల్యాణ్ భావించినట్లున్నారు. ఆయన ఒక టివి ఉండాలనే నిర్ణయానికి వచ్చారని, ఇపుడున్నవాటిలో ఒక చానెల్ టేకోవర్ చేస్తారనే వార్త గుప్పు మంది.
పవన్ ఇప్పటికదా ట్విట్టర్ గూటినుంచి పలుకుతూ వచ్చారు. తెలుగు నాట టివికి, పత్రికలకు ఇంకా ప్రాబల్యం వుందని , వాటిద్వారాసాధారణ ప్రజలకు చేరువవుతామని ఆయనఈ మధ్య గ్రహించారు. టిడిపితో ఉన్నపుడు సాక్షి, టిడిపి నుంచి దూరంగా జరిగాక కొన్ని పత్రికలు, చానెళ్లు దాడి చేస్తున్నాయి. దీనికి సమాధానం చెప్పుకునేందుకు తన దగ్గిర ట్విట్టర్ తప్ప మరొకటి లేక పోవడం వెలితిగా ఉందని ఆయన గ్రహించారనితెలిసింది. ఇపుడొక చానెల్ లో పడ్డారని, అక్విజిషన్ దాదాపు ఖారారయిందని చెబుతున్నారు. గుప్పు మన్న వార్తల ప్రకారం, త్వరలోనే పాత చానెల్ జె.న్యూస్ (జె ఫర్ జనసే) గా వేషం మార్చుకుంటుందని తెలిసింది. సిపిఐ నాయకులు, అభిమానులు నడుపుతూ వచ్చిన 99న్యూస్ చానెల్ ను పవన్ కొనబోతున్నారని సమాచారం.
99 న్యూస్ చానెల్ ను టేకోవర్ చేయడం పై జనసేన పార్టీలో తీవ్ర చర్చలు జరిగాయని, కొన్ని మైనస్ పాయింట్లు ఉన్నా, కొత్త చానెల్ ఏర్పాటుకు సమయం లేదని, పాతచానెల్ కు కొత్త రూపు ఇవ్వడం బాగుంటుందని చాలా మంది సలహాలు ఇచ్చినట్లు చెబుతున్నారు.
సిపిఐ జాతీయ నేత సురవరం సుధాకర్ రెడ్డి తనయుడు కొంత కాలం పాటు సారధ్యం వహించిన ఈ చానెల్ కు ఆ తర్వాత తమ్మారెడ్డి భరద్వాజ దీని బాధ్యతలు నిర్వహించారు. కానీ చానెల్ విశాలాంధ్రలాగే కోమాలోనే ఉంటున్నది. తమకు ఉన్న స్నేహ బంధం రీత్యా టీవీని జనసేనకు అప్పగించడం మేలని చానెల్ నిర్వాహకులు కూడా భావిస్తున్నట్లు తెలిసింది.
పవన్ యాత్రకు ఇక చానెల్ 99 కొండంత అండగా ఉంటుందన్నమాట.