గోదావరి నది అందాలను, కిన్నరెసాని హొయలను తిలకించాలని బయలుదేరిన టూరిస్ట్ బోట్ ఒకటి తగలబడింది. ఆ బోటులో 80 మంది యాత్రికులు ఉన్నారు. నది ఒడ్డు నుంచి బయలుదేరిన కొద్దిసేపటికే దేవీపట్నం మండలం వీరవరపులంక దగ్గర ప్రమాదానికి గురైంది. బోటులో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు వ్యాపించినట్టు ప్రాధమికంగా తెలుస్తోంది.
ఈ ఘటనతో యాత్రికులు తీవ్ర భయాందోళనలకు గురై, తమ సెల్ ఫోన్ల నుంచి దగ్గర్లో ఉన్న పరిచయస్తులకు, పోలీసులకు ఫోన్లు చేశారు. విషయం తెలుసుకున్న అధికారులు, వెంటనే బోటు వద్దకు సహాయపు బోట్లను, గజ ఈతగాళ్లను పంపించారు. ఈ ఘటనకు సంబంధించి మరింత సమాచారం తెలియాల్సివుంది. బోటు కాలిపోతున్న వీడియో పైన ఉంది చూడండి.