* మన మువ్వన్నెల జెండా సమగ్రత, సమైక్యతలకు సూచిక
* జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్
* అతిపెద్ద త్రివర్ణ పతాకం ఆవిష్కారం
మన నాయకులు జాతీయ సమైక్యతని మరచిపోయారని జనసేన నేత పవన్ కల్యాణ్ ఆవేదన వ్యక్తం చేశారు. అయితే తన చుట్టుూ ర ఉన్న యువతరాన్ని చూసి ఆయన ఆవేదన మర్చిపోయారు. వాళ్లు మర్చిపోయినా పర్వాలేదు, మేమున్నాంఅనే తరం దుకు వచ్చిందని హర్షంతో చెప్పారు. నాయకులు జాతీయ సమైక్యతను మరచిపోయినా యువత , విద్యార్థి లోకం ఆ దిశగా ప్రతిజ్ఞ తీసుకుంటుందన్నారు, మరేం పర్వాలేదు. పదండి ముందుకు అన్నారు. ఉత్సాహం నింపారు. ఉరకలెత్తించారు.
ప్రపంచంలోనే అతి పెద్ద భారత జాతీయ పతాకాన్ని గురువారం హైదరాబాద్ లో పవన్ కళ్యాణ్ ఆవిష్కరించారు. ఎన్టీఆర్ స్టేడియంలో ‘వైబ్రెంట్స్ ఆఫ్ కలామ్’ సంస్థ ఈ జెండాను రూపొందించింది. ఈ పతాకం 122 అడుగుల పొడవు, 183 అడుగుల వెడల్పుతో ( 22,326 చదరపు అడుగుల విస్తీర్ణం) ఉంది. ఈ భారీ జాతీయ పతాకాన్ని పవన్ కళ్యాణ్ ఈ రోజు ఆవిష్కరించారు.
దీనికి సంబంధించిన గ్యాలరీ:
తొలి స్వాతంత్ర పోరాటాన్ని స్మరించుకుంటూ ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ వేడుకలో యువత, విద్యార్థులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ “ఈ జెండాలో కాషాయం, తెలుపు, ఆకుపచ్చ రంగులు, అశోక చక్రం.. ఇవన్నీ మన జాతి సమగ్రతకి, జాతీయ సమైక్యతకు నిదర్శనం అన్నారు.
పవన్ ఇంకా ఏమన్నారంటే…
సర్వేపల్లి రాధాకృష్ణన్ చెప్పినట్లు మన జాతీయ జెండా ఏ కులానిదీ, పార్టీది, మతానిది కాదు. ప్రతి ఒక్కరిదీ. కాషాయం అంటే హిందూ మతానికి సూచిక కాదు. ఆ రంగు మన రాజకీయ వ్యవస్థ, నాయకులు ఎలా ఉండాలో చెబుతుంది. కాషాయం కట్టినవాళ్ళు సర్వసంగ పరిత్యాగులుగా, స్వలాభం లేకుండా ఉంటారు. నాయకులూ అలాగే ఉండాలి. మన జెండా దేశం కోసం త్యాగాలు చేసినవారిని, స్వలాభం లేకుండా పని చేస్తారో గుర్తు చేస్తుంది. యువత ముందుకు వచ్చి ఈ వేడుకను నిర్వహించడం ఆనందంగా ఉంది. మీ ఔన్నత్యాన్ని తెలియచేస్తోంది”.
ఈ సందర్భంగా ఈ వేడుకకు హాజరైన వారితో ఆయన జాతీయ సమైక్యత ప్రమాణం చేయించారు. ‘భారతీయుడినైన నేను.. భారతదేశ పౌరుడిగా పుట్టినందుకు గర్వపడుతున్నాను. నా దేశ వారసత్వ సంపదను పరిరక్షిస్తూ.. ప్రకృతికి నష్టం కలిగించకుండా పర్యావరణాన్ని కాపాడుతూ.. అనునిత్యం దేశ ప్రజలకై పరితపిస్తూ.. మన అక్కచెల్లెళ్ళనీ, ఆడపడుచుల పట్ల పేగు బంధంతో కాపాడుతామని.. చట్టాలను గౌరవిస్తూ.. కుల,మత, ప్రాంత, వర్గ విభేదాలకు తావులేకుండా దేశ ప్రయోజనాలే పరమావధిగా భావిస్తానని మన జెండా సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను’ అంటూ ఈ ప్రమాణం సాగింది. ఈ కార్యక్రమంలో వైబ్రెంట్స్ ఆఫ్ కలామ్ సంస్థ వ్యవస్థాపకుడు విజయ్ కలామ్ పాల్గొన్నారు.